newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

ఐపీఎల్ 2020.... ఫ్లేయర్స్‌కు అగ్నిపరీక్షే

08-08-202008-08-2020 10:45:41 IST
2020-08-08T05:15:41.428Z08-08-2020 2020-08-08T05:13:43.525Z - - 30-09-2020

ఐపీఎల్ 2020.... ఫ్లేయర్స్‌కు అగ్నిపరీక్షే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా సమయంలో ఆటలు మామూలు కాదు. అంత ఆషామాషీగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదు. బయో సెక్యూర్‌ వాతావరణంలో చిన్న తప్పిదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహ యజమాని నెస్‌వాడియా అంటున్నారు. దుబాయ్‌లో జరుగనున్న ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా.. లీగ్‌ మొత్తం నాశనం అవుతుందని పేర్కొన్నాడు. ‘ఈ ఐపీఎల్‌ను అత్యధిక మంది వీక్షించకపోతే నా పేరు మార్చుకుంటా అన్నారు. 

ఇది అత్యుత్తమ ఐపీఎల్‌ కాబోతోంది. ఈ లీగ్‌లో భాగమవ్వకపోతే స్పాన్సర్లు మూర్ఖంగా వ్యవహరించినట్లే. ఆటగాళ్లు, సిబ్బంది భద్రత గురించే ఆందోళన అంతా. ఎందుకంటే ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైనా లీగ్‌ మొత్తం నాశనం అవుతుంది’అని వాడియా చెప్పుకొచ్చాడు. ఈ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. పకడ్బందీ చర్యలు చేపడితేనే ఆటగాళ్ళ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా వుండదు. 

నాకు కరోనా రాలేదు: బ్రియాన్ లారా 

West Indies legend Brian Lara discharged from Mumbai hospital ...

కరోనా వైరస్ అందరినీ భయపెడుతోంది. తాజాగా ఓ ఆటగాడికి కరోనా సోకిందంటూ విపరీతమయిన ప్రచారం సాగుతోంది.  తనకు కరోనా సోకిందంటూ సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఖండించాడు. అవి తప్పుడు వార్తలని అన్నాడు. తాను కరోనా పరీక్ష చేయించుకున్నది వాస్తమేనని..కానీ, ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. కరోనా మహమ్మారి కారణంగా యావత్‌ సమాజం తల్లడిల్లిపోతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విష ప్రచారాలను ఆపాలని లారా కోరాడు. 

 

బాధను బయటపెట్టిన రషీద్ ఖాన్.. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నాయా

బాధను బయటపెట్టిన రషీద్ ఖాన్.. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నాయా

   2 hours ago


ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌.. భారీ జరిమానా

ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌.. భారీ జరిమానా

   2 hours ago


డ్రీమ్ లెవెన్ కు అలా షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

డ్రీమ్ లెవెన్ కు అలా షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

   5 hours ago


వింటేజ్ రషీద్ ఖాన్.. దుమ్ము దులిపాడుగా..!

వింటేజ్ రషీద్ ఖాన్.. దుమ్ము దులిపాడుగా..!

   6 hours ago


కదం తొక్కిన సన్ రైజర్స్ బౌలర్లు.. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్

కదం తొక్కిన సన్ రైజర్స్ బౌలర్లు.. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్

   7 hours ago


రైనా, హర్భజన్ పేర్లను తీసేసిన చెన్నై సూపర్ కింగ్స్

రైనా, హర్భజన్ పేర్లను తీసేసిన చెన్నై సూపర్ కింగ్స్

   29-09-2020


రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ ల లోనూ అదే పొరపాటు..!

రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ ల లోనూ అదే పొరపాటు..!

   29-09-2020


థ్రిల్లింగ్ మ్యాచ్ పై అనుష్క స్పందన..!

థ్రిల్లింగ్ మ్యాచ్ పై అనుష్క స్పందన..!

   29-09-2020


ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!

ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!

   29-09-2020


సారీ తెవాటియా.. తప్పుగా అంచనా వేశా.. ఎమెస్కే ప్రసాద్

సారీ తెవాటియా.. తప్పుగా అంచనా వేశా.. ఎమెస్కే ప్రసాద్

   29-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle