newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ 2020పై గంగూలీ ఆశలు..

11-06-202011-06-2020 15:16:25 IST
2020-06-11T09:46:25.981Z11-06-2020 2020-06-11T09:46:18.890Z - - 12-04-2021

ఐపీఎల్ 2020పై గంగూలీ ఆశలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈఏడాది ఏప్రిల్ లో జరగాల్సిన క్రికెట్ పండుగను కరోనా వైరస్ మింగేసింది. దీంతో క్రీడాభిమానులు, క్రీడాకారులు, ఫ్రాంఛైజీలు ఆందోళనకు గురయ్యాయి. అయితే ఈసారి ఐపీఎల్ 2020 పై ఆశలు పెట్టుకోమంటున్నారు సౌరవ్ గంగూలీ. త్వరలో ఐపీఎల్ 2020పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నామంటున్నారు. అక్టోబర్‌–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తర్జనభర్జన పడుతోంది. ఒకవేళ ఈ టోర్నమెంట్ రద్దయితే ఐపీఎల్ కు మార్గం సుగమం అవుతుంది.

ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన కసరత్తును భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) పెంచింది. టీ20 వరల్డ్‌కప్‌ జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్‌ను జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఐపీఎల్‌ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని తమ బీసీసీఐకి అనుబంధంగా వున్న వివిధ రాష్ట్రాల  క్రికెట్‌ అసోసియేషన్‌లను బీసీసీఐ అలెర్ట్‌ చేసింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. రాష్ట్ర అసోసియేషన్‌లకు లేఖ రాశాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్‌ నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నామని గంగూలీ పేర్కొనంనాడు. 

టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో మరోసారి ఐసీసీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది.  ప్రపంచకప్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల పాటు వేచి చూడనుంది.  టి20 ప్రపంచకప్‌తో పాటు 2021లో మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లను షెడ్యూల్‌ ప్రకారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా కొనసాగిస్తామని ఐసీసీ పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడుతున్న పరిస్థితులను సమీక్షిస్తూనే ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పింది. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితే, ఐపీఎల్‌ సాధ్యపడుతుంది. అభిమానులు ఆరోజు కోసమే వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle