newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

ఐపీఎల్: హిట్‌మ్యాన్ కొడితే బాక్స్ బద్దలైంది..

10-09-202010-09-2020 09:50:36 IST
Updated On 10-09-2020 09:52:49 ISTUpdated On 10-09-20202020-09-10T04:20:36.245Z10-09-2020 2020-09-10T04:20:34.191Z - 2020-09-10T04:22:49.469Z - 10-09-2020

ఐపీఎల్:  హిట్‌మ్యాన్ కొడితే బాక్స్ బద్దలైంది..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో మొదలుకానుంది. రాబోయే సీజన్ కోసం అన్ని జట్లూ కఠిన శిక్షణను మొదలెట్టేశాయి. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు కూడా సన్నాహక చర్యల్లో వెనుకంజ వేయకుండా కృషి చేస్తోంది. ప్రస్తుతం అబు దుబాయిలో ఉంటున్న జట్టు ఈ నెల 19న గత సంవత్సరం రన్నర్‌గా నిలిచిన చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుతో తలపడటానికి ముమ్మరంగా సాధన చేస్తోంది. 

ఎవడు కొడితే... వాడే పండుగాడు అనే తెలుగు సినిమా డైలాగ్ ఎంతగా పేలిందో.. ఈ రోజుకూ జనం నాలుకలపై నానుతోందో మనందరికీ తెలుసు. అలాగే బాక్స్ బద్దలవుద్ది అంటూ ఇటీవలే మరొక సినిమా డైలాగ్ మామూలుగా పేలలేదు. సమకాలీన క్రికెట్ విషయానికి వస్తే అలాంటి ఘనత ముంబై ఇండియన్స్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకే దక్కుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. 

Dream11 IPL 2020: Rohit Sharma hits six out of the park, ball lands on the moving  bus rooftop - See Latest

నాలుగు నెలలకుపైగా క్రికెట్ ఆట అన్నదే లేకుండా తపించిపోయినట్లు కనిపిస్తున్న రోహిత్ శర్మ దుబాయ్‌లో జరుగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌లో ప్రాక్టీసులో భాగంగా బౌలర్ బంతిని చాచి కొడితే అది 95 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయట వెళుతన్న బస్సు రూఫ్ టాప్‌పై పడి బస్సు గ్లాసుబద్దలు చేసినంత పని చేసింది. దాన్ని చూసి టీమ్ మేట్లు ఔరా అంటూ నవ్వలేక పడిపోయారు.

ఐపీఎల్‌లో ఎవ‌రి సిక్స్ ఎంత దూరం వెళుతుంద‌న్న‌ది రికార్డుల్లో లెక్కేస్తారు. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంటేనే భీక‌ర‌మైన‌ హిట్టింగ్‌కు పెట్టింది  పేరు. బ్యాటింగ్ ఆడేట‌ప్పుడు రోహిత్ శ‌ర్మ ఎంత క‌సిగా ఉంటాడ‌నేది ఇప్ప‌టికే చాలాసార్లు చూశాం. అత‌ను బంతిని బ‌లంగా బాదాడంటే.. స్టేడియం అవ‌త‌ల ప‌డాల్సిందే. 

తాజాగా దుబాయ్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు ఆట‌గాళ్లు త‌మ ప్రాక్టీస్‌ను కొన‌సాగిస్తున్నారు. కాగా ఈ సీజ‌న్‌లో చెన్నైతో జ‌రిగే మొద‌టి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డనున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్  కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అబుదాబి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒక‌టి ఆ జ‌ట్టు యాజ‌మాన్యం షేర్ చేసింది. 

ఆ వీడియోలో బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న రోహిత్ స్పిన్న‌ర్ వేసిన బంతిని బారీ సిక్స్‌గా మ‌లిచాడు.  95 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి స్టేడియం బ‌య‌ట‌కు వెళ్లి రోడ్డు మీద వెళ్తున్న బ‌స్సు రూఫ్‌టాప్‌పై ప‌డింది. ఇంకేముంది.. బౌలింగ్ వేసిన స్పిన్న‌ర్ బిత్త‌ర‌చూపులు చూడగా.. రోహిత్ విజ‌య‌సంకేతం చూపించాడు. 

దాదాపు నాలుగు నెల‌ల త‌ర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేప‌ట్టిన రోహిత్ బారీ షాట్ల‌తో రీచార్జ్ అయిన‌ట్లే క‌నిపిస్తుంది. రానున్న మ్యాచ్‌లో త‌న విధ్వంసం ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌క‌నే చెప్పాడు. ఈ వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌న ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ వినూత్న కాప్ష‌న్‌ను రాసుకొచ్చింది. 

'బ్యాట్స్‌మెన్లు సిక్స్‌లు కొడతారు.. లెజెండ్స్ స్టేడియాల‌ను క్లియ‌ర్ చేస్తారు.. కానీ హిట్‌మ్యాన్ మాత్రం మూడు ప‌నులు (బారీ సిక్స్‌+ స్టేడియం అవ‌త‌ల + వాహ‌‌నాల‌పై ప‌డ‌డం) క‌లిపి చేస్తాడు. అది ఒక్క రోహిత్‌కే సాధ్యం' అంటూ కామెంట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడిమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

అయితే వీడియో చివ‌ర్లో నీ సిక్స్‌తో బ‌స్సు అద్దాల‌ను గాని ప‌గ‌ల‌గొట్టావా అంటూ రోహిత్‌ను ఎవ‌రో అడిగినట్లు వినిపిస్తుంది. కాగా అంత‌కుముందు ప్రాక్టీస్ సంద‌ర్భంగా ముంబై ప్ర‌ధాన బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ స‌మ‌యంలో ఆరు బంతులను ఆరుగురు బౌల‌ర్ల‌ను ఇమిటేట్ చేస్తూ విసిరిన వీడియో కూడా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle