newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

10-08-202010-08-2020 17:49:00 IST
Updated On 10-08-2020 21:57:05 ISTUpdated On 10-08-20202020-08-10T12:19:00.107Z10-08-2020 2020-08-10T12:18:50.476Z - 2020-08-10T16:27:05.802Z - 10-08-2020

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్‌ 2020 స్పాన్సర్‌ షిప్‌ రేసులో అనేక ప్రముఖ సంస్థలున్నాయి. స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతమాత్రాన బోర్డు  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వివో స్థానంలో పతంజలి సంస్థ పోటీపడుతోంది. వివో ఐపీఎల్ నుంచి వెళ్లిపోవడం వల్ల ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. గత బోర్డు పాలకులు, మేటి ఆటగాళ్లు బీసీసీఐకి పటిష్ట పునాదులు వేశారన్నారు గంగూలీ. 

పతంజలి ప్రధాన ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ చేసేందుకు పతంజలి సిధ్ధంగా ఉందని, ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లో వివో 5 ఏళ్ళకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వివో 2022 వరకు కొనసాగాలి.

అయితే కరోనా, బాయ్‌కాట్ చైనా వంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ వివోను స్పాన్సర్ షిప్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ల కోసం బిడ్డింగ్ నిర్వహించనుంది. ఈ బిడ్డింగ్‌లో పతంజలి కూడా పాల్గొననుంది. దీంతో పాటు జియో కూడా రేసులో వుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle