newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ సీజన్ షెడ్యూల్ పై ఇవాళే క్లారిటీ

02-08-202002-08-2020 13:11:57 IST
Updated On 02-08-2020 13:14:59 ISTUpdated On 02-08-20202020-08-02T07:41:57.422Z02-08-2020 2020-08-02T07:40:36.817Z - 2020-08-02T07:44:59.101Z - 02-08-2020

ఐపీఎల్ సీజన్ షెడ్యూల్ పై ఇవాళే క్లారిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్‌పై ఇవాళ పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన ఈరోజు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. 

టోర్నీ షెడ్యూల్, క్రికెటర్ల ప్రయాణం, క్వారంటైన్, స్టేడియాల్లోకి ప్రేక్షకుల ఎంట్రీ తదితర అంశాల గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.  మీటింగ్‌కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్ కూడా హాజరుకానున్నారు. ఈ మీటింగ్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2020 సీజన్‌ గురించి పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోవడంతో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన బీసీసీఐ.. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ మొత్తం 51 రోజుల విండో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించాలని షెడ్యూల్ ప్లాన్ చేసింది. 

దీపావళి సీజన్‌ని వాడుకోవాలని బ్రాడ్‌కాస్టర్, ఫ్రాంఛైజీలు సూచించడంతో.. ఫైనల్‌ని నవంబరు 10కి మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో.. ఈరోజు గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆ ఫైనల్ తేదీపై పూర్తి స్థాయిలో క్లారిటీరానుంది. కరోనా నేపథ్యంలో.. అన్ని దేశాలు క్వారంటైన్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తుండటంతో.. యూఏఈకి నెల రోజుల ముందే ఆటగాళ్లు చేరుకోనున్నారు. 

పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ జరగనుండగా.. ఆ బయో సెక్యూర్ బబుల్ రూల్స్‌పై విధివిధానాల్ని రూపొందించి.. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలకి వాటిని గవర్నింగ్ కౌన్సిల్ అందించే అవకాశం ఉంది. అలానే స్టేడియాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించాలని యూఏఈ క్రికెట్ బోర్డు భావిస్తుండగా.. గవర్నింగ్ కౌన్సిల్‌ మీటింగ్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   26 minutes ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   4 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   8 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   20 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle