newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ షురూ... ఆర్సీబీపై వెల్లువెత్తుతున్న ట్రోల్స్

25-07-202025-07-2020 08:45:23 IST
Updated On 25-07-2020 09:38:42 ISTUpdated On 25-07-20202020-07-25T03:15:23.434Z25-07-2020 2020-07-25T03:15:05.833Z - 2020-07-25T04:08:42.162Z - 25-07-2020

ఐపీఎల్ షురూ... ఆర్సీబీపై వెల్లువెత్తుతున్న ట్రోల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ అభిమానులు పండుగ చేసుకునే రోజు రాబోతోంది. కరోనా వైరస్ వల్ల ఏప్రిల్ మాసంలో జరగాల్సిన అతి పెద్ద క్రికెట్ వేడుక వాయిదా పడింది. ఒకానొక సమయంలో అసలు జరుగుతుందో లేదో అనే అనుమానాలు వచ్చాయి. అయితే బీసీసీఐ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. ఐపీఎల్ 2020 సీజన్‌పై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ శుక్రవారం స్పష్టం చేశాడు.

మొత్తం 51 రోజుల ఈ విండోలో 60 మ్యాచ్‌లు జరగనుండగా.. కేవలం ఐదు డబుల్ హెడర్ మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్ షెడ్యూల్‌పై ఇలా బ్రిజేశ్ పటేల్ క్లారిటీ ఇవ్వగానే... ట్విట్టర్‌లో అలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ట్రోల్స్ మొదలైపోయాయి.

https://www.photojoiner.net/image/hHvS5IPE

ఐపీఎల్‌లో కారణం ఏదైనా.. ఆర్సీబీపై ట్రోల్స్ చాలా కామన్. ఆ జట్టు గెలిచినా.. ఓడినా ఫ్యాన్స్ మాత్రం సెటైర్లు వేస్తుంటారు. దానికి కారణం ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోవడమే. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. రెండు సార్లు ఫైనల్‌కి చేరిన ఆ జట్టు ఒక్కసారి కూడా కప్‌ని ముద్దాడలేకపోయింది. కానీ.. ప్రతి ఏడాది ఈసారి కప్ మనదే అంటూ బరిలోకి దిగడం.. ఆఖరికి ఉసూరమనిపించడం ఆర్సీబీకి పరిపాటిగా మారింది.

ముంబయి ఇండియన్స్ నాలుగు సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచాయి. కానీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం టోర్నీ విజేతగా నిలవలేకపోతోంది.బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలకడగా రాణించినప్పటికీ.. కెప్టెన్‌గా టీమ్‌ని సమష్టిగా నడిపించడంలో అతను విఫలమవుతున్నాడు. దాంతో.. కనీసం ఐపీఎల్ 2020 సీజన్‌లోనైనా ఆర్సీబీ కప్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

https://www.photojoiner.net/image/1DMGz8Do

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   4 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   8 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   15 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   16 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle