newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

ఐపీఎల్ వేలానికి 971 మంది క్రికెటర్లు..

03-12-201903-12-2019 17:19:23 IST
2019-12-03T11:49:23.630Z03-12-2019 2019-12-03T11:49:21.665Z - - 06-12-2019

ఐపీఎల్  వేలానికి 971 మంది క్రికెటర్లు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఐపీఎల్ లో పాల్గొంటే చాలు రాత్రికి రాత్రే ఆటగాళ్లు కోటీశ్వరులుగా మారిపోతుంటారు. అందుకనే ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో పాల్గొనేందుకు ఉత్సాహాం చూపిస్తుంటారు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్ కత్తాలో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనడానికి 971 మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. 

ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లు పాల్లొనడానికి దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు నవంబర్‌ 30. ఈ గడువు ముగియడంతో మొత్తంగా 971 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 713 మంది భారత ఆటగాళ్లు కాగా 258 మంది విదేశీ ప్లేయర్లు. అయితే వీరిలో 73మంది ఆటగాళ్లను మాత్రమే అదృష్టం వరించనుంది. దరఖాస్తు చేసుకున్నవారిలో 215 మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.

భారత్‌ నుంచి నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 19 మంది క్యాప్‌డ్‌ ప్లేయర్లు, 634 మంది అన్‌క్యాపడ్‌ ప్లేయర్లు, కనీసం ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ఆటగాళ్లు 60 మంది, జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు 196 మంది, ఆడని వారు 60 మంది ఉన్నారు. అఫ్గానిస్థాన్ (19), ఆస్ట్రేలియా (55), బంగ్లాదేశ్‌ (6), ఇంగ్లాండ్‌ (22), నెదర్లాండ్స్‌ (1), న్యూజిలాండ్‌ (24), దక్షిణాఫ్రికా (54), శ్రీలంక (39), యూఎస్‌ఏ (1), వెస్టిండీస్‌ (34), జింబాబ్వే (3) ఆటగాళ్లు దరఖాస్తు చేశారు.

ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్ని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది. ఆజాబితా వచ్చాక ఈనెల 19న కోల్ కత్తాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. 

స్టార్క్‌ అవుట్‌ : ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిషెల్‌ స్టార్క్‌ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. అతను 2019 ఐపీఎల్‌లో ఆడలేదు. మరోవైపు ఏడుగురు విదేశీ క్రికెటర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి సిద్ధపడుతున్నారు. ఈ జాబితాలో కమిన్స్, హాజల్‌వుడ్, లిన్, మిషెల్‌ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టెయిన్, మాథ్యూస్‌ ఉన్నారు. భారత్‌ తరఫున ఆడిన 19 మందిలో ఒక్కరు కూడా ఈ కనీస విలువలో తమ పేరు చేర్చకపోవడం విశేషం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle