newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ వాయిదా బీసీసీఐకి మోయలేని భారమేనా?

17-04-202017-04-2020 13:07:49 IST
Updated On 17-04-2020 13:42:35 ISTUpdated On 17-04-20202020-04-17T07:37:49.286Z17-04-2020 2020-04-17T07:37:08.754Z - 2020-04-17T08:12:35.299Z - 17-04-2020

ఐపీఎల్ వాయిదా బీసీసీఐకి మోయలేని భారమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా అన్నిరంగాలు కుదేలవుతున్నాయి. ఐపీఎల్‌ 2020 నిర్వహణ ఇక జరగదని తేలిపోయింది. ఏవిధంగానైనా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ తనవంతు ప్రయత్నాలు చేసింది.  ర్చి నుంచే ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా టోర్నీ నిర్వహణకి ఓకే చెప్పిన ఫ్రాంచైజీలు.. విదేశీ క్రికెటర్లు లేకుండా మాత్రం ఐపీఎల్‌ వద్దని స్పష్టం చేశాయి. ఇక విదేశాల్లో నిర్వహించాలని చూసినా.. వైరస్‌ అంతటా ఉంది. 

ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఐపీఎల్‌ నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది. మరోవైపు టీ20 ప్రపంచ కప్‌ను ఐసీసీ, ఆస్ట్రేలియా రీషెడ్యూల్‌ చేస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌- నవంబర్‌ మధ్య లీగ్‌ను నిర్వహించే వీలుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అయితే రెండో విడత లాక్‌డౌన్‌ ముగిసిన తరువాతనే బీసీసీఐ లీగ్‌ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతోంది. ప్రతిష్టాత్మకమయిన ఐపీఎల్‌ 2020 భవితవ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదని, మహమ్మారి కరోనా వైరస్‌ సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఐపీఎల్‌ సమస్యకు పరిష్కారం కోసం భాగస్వాములందరితో బోర్డు ఎప్పటికప్పుడు చర్చిస్తూ వుంది. మే 3 తరువాత మాత్రమే పరిస్థితిని బట్టి బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ నిరవధిక వాయిదా కారణంగా బీసీసీఐకి భారీ నష్టం తప్పేలా లేదు. ఐపీఎల్ అంటేనే ఖరీదైన ఈవెంట్. అలాందిది అర్థంతరంగా దానిని ఆపేస్తే. పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈఏడాది  ఐపీఎల్‌ జరగకపోతే బీసీసీఐ రూ.5000 కోట్ల నుంచి రూ.7500 కోట్ల వరకు నష్టం తప్పదంటున్నారు. దీని ప్రభావం బీసీసీఐపై తీవ్రంగా పడుతుంది. ఐపీఎల్‌ రద్దు అయితే.. ఐదేళ్ల పాటు బీసీసీఐ నుంచి టెలికాస్ట్‌ హక్కులు తీసుకున్న స్టార్‌ ఇండియాకు రూ.3,269 కోట్ల నష్టం. ఈ ఐపీఎల్ దెబ్బ స్టార్ స్పోర్ట్స్ కే కాదు ఆ గ్రూప్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. టైటిల్‌ స్పాన్సర్‌ చేస్తున్న వీవో నుంచి కూడా రూ.400 కోట్ల ఆదాయం బీసీసీఐ కోల్పోవడం ఖాయం. కరోనా వల్ల మన ఆర్థిక వ్యవస్థే కాదు క్రీడారంగం కూడా భారీగానే నష్టపోనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle