newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ వాయిదా? కరోనా దెబ్బకు బీసీసీఐ కోలుకోవడం కష్టమేనా?

13-03-202013-03-2020 15:39:47 IST
2020-03-13T10:09:47.520Z13-03-2020 2020-03-13T10:09:45.229Z - - 14-04-2021

ఐపీఎల్ వాయిదా? కరోనా దెబ్బకు బీసీసీఐ కోలుకోవడం కష్టమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ దెబ్బకు క్రికెట్ పోటీలు కూడా వాయిదా పడుతున్నాయి. ఐపీఎల్ పోటీలపై కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే పడనుంది. ఒకవేళ టోర్నమెంట్ గనక రద్దయితే బీసీసీఐ భారీగా నష్టం చవిచూడాల్సి రావచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల సుమారు 10 వేల కోట్లు నష్టం తప్పదంటున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దీంతో పోటీల నిర్వహణపై సందిగ్దత ఏర్పడింది. కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫ్రాంచైజీలు కూడా ఇదే విషయంపై బీసీసీఐని కోరడంతో అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తీసుకుంటే ఐపీఎల్‌ను వాయిదా వేయడమే కరెక్టని బీసీసీఐ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

అంతేగాక ఐపీఎల్‌ సీజన్‌కు విదేశీ ఆటగాళ్లు కూడా ఏప్రిల్‌ 14వ తేదీ వరకు అందుబాటులో ఉండరు. ఇదే విషయమై ఐపీఎల్‌ ప్రాంచైజీలు కూడా లీగ్‌ను రెండు వారాలు వాయిదా వేయాలని కోరాయన్నారు. దీంతో ఏప్రిల్‌15 నుంచి ఐపీఎల్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే శనివారం ఐపీఎల్‌ గవర్నింగ్‌ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ సీజన్‌.. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 

ఇటు ఢిల్లీలో మ్యాచ్ ల జరగవు.  ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించిన  మ్యాచ్‌లను ఢిల్లీలో నిర్వహించకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పాటు మిగతా క్రీడా పోటీలపైనా నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్పటికే ఢిల్లీలో 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తే స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉంది. దాంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ఢిల్లీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిషేధిస్తున్నాం. ఐపీఎల్‌తో పాటు మిగతా క్రీడలకు సంబంధించిన ఈవెంట్లను కూడా అనుమతించేది లేదు. ఒకవేళ బీసీసీఐ కొత్త ఫార్మాట్‌లో ఐపీఎల్‌లో నిర్వహించాలనుకుంటే అది వారి ఇష్టం' అని పేర్కొన్నారు కేజ్రీవాల్. 

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   2 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   7 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   13 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   15 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle