ఐపీఎల్... రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే
09-01-202009-01-2020 12:01:03 IST
2020-01-09T06:31:03.869Z09-01-2020 2020-01-09T06:31:00.313Z - - 15-04-2021

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తో లీగ్ మొదలవుతుంది. మే 24న ముంబైలోనే ఫైనల్ నిర్వహిస్తారు. టోర్నీ ఆనవాయితీ ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ జట్టుకు తర్వాతి సీజన్లో ప్రారంభ మ్యాచ్‌తోపాటు ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతుంది. 2019 ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలువడంతో ఈ ఏడాది ముంబైలో ఆరంభ మ్యాచ్‌ను, ఫైనల్‌ను నిర్వహిస్తారు. మొత్తం 57 రోజుల పాటు టోర్నీ జరగనుంది. ఇక పోతే శని, ఆదివారాల్లో ఇప్పటి వరకు రోజుకు రెండు మ్యాచ్ లను నిర్వహిస్తుండగా ఇప్పటి నుంచి రోజుకు ఒక మ్యాచ్ ను మాత్రమే నిర్వహించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు జరపనున్నారు. ఐపీఎల్ ప్రసాదదారు విన్నపం మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటి వరకూ 12 సీజన్లు పూర్తి చేసుకుంది. 2020 సీజన్లో 8 జట్లు పోటీపడనుండగా.. టోర్నీ లీగ్ దశలో ప్రతి జట్టూ రౌండ్ రాబిన్ పద్ధతిలో మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ క్రమంలో ప్రతి టీమ్ సొంతగడ్డపై ఏడు మ్యాచ్‌లు.. ప్రత్యర్థి సొంత మైదానాల్లో ఏడు మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ ఒక మ్యాచ్ జరగనుండగా.. ఆ మధ్యలో సెలవు రోజు ఏమైనా ఉంటే ఆరోజు రెండు మ్యాచ్‌ల్ని నిర్వహిస్తూ వచ్చారు. ఇక శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్‌లు జరుగుతూ వచ్చాయి. కానీ తాజా ప్రతిపాదనతో వారాంతాల్లోనూ ఒక్క మ్యాచే నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు కూడా రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
13 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
17 hours ago

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
a day ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
14-04-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021
ఇంకా