newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ యాడ్స్ చాలా కాస్ట్లీ గురూ!

15-08-202015-08-2020 10:48:31 IST
Updated On 15-08-2020 13:15:16 ISTUpdated On 15-08-20202020-08-15T05:18:31.408Z15-08-2020 2020-08-15T05:15:28.483Z - 2020-08-15T07:45:16.844Z - 15-08-2020

ఐపీఎల్ యాడ్స్ చాలా కాస్ట్లీ గురూ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ క్రీడ అంటేనే చాలా ఖరీదైంది. ఆటగాళ్ళ రెమ్యూనరేషనే ఎక్కువగా వుంటుంది. అలాగే లైవ్ సందర్భంగా కంపెనీల యాడ్స్ కూడా చాలా ఖరీదైనవి.  దేశంలో కోవిడ్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 హంగామా మరికొద్ది రోజుల్లోనే మొదలు కాబోతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ జరగనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.

కరోనా కట్టడికోసం.. ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించడంలేదు. దీంతో టీవీల్లో వ్యూవర్‌షిప్‌ రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టార్‌స్పోర్ట్స్‌ 10 సెకన్ల యాడ్‌కి రూ.10 లక్షల ధరని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మధ్యలోనే దసరా, దీపావళి కూడా వస్తుండటంతో.. యాడ్స్‌ ఇచ్చేందుకు కంపెనీలు కూడా పోటీపడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2019 సీజన్‌లో యాడ్స్‌ ద్వారా స్టార్‌స్పోర్ట్స్ రూ.3000 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబరులోనే ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ భారీ ధర పలికాడు. ఈసారి వేలంలో అత్యధిక ధర పలికి ఆటగాళ్లలో ఒక్కడిగా నిలిచాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన అతనికి అత్యంత భారీ ధర పలికింది. రూ.15.50 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని కొనుగోలు చేసింది.

పేసర్ కమిన్స్ ను దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చాలా ఆసక్తి చూపించాయి. కోల్‌కతా అతడిని దక్కించుకుంది. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమిన్స్ కోసం గట్టి పోటీనిచ్చిన సంగతి తెలిసిందే. ఒకదశలో తన దేశానికే చెందిన గ్లెన్ మ్యాక్స్ సాధించిన రూ.10.75 కోట్లను దాటిన కమిన్స్‌ను ఆఖరివరకు పోరాడి కోల్‌కతా చేజిక్కుంచుకుంది. ఇంత ఖరీదైన ఆట కాబట్టే ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ పట్టుబట్టింది. కరోనా వేళ అనేక జాగ్రత్తలు తీసుకుని యుఏఇలో ఈ క్రీడకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు స్పాన్సర్ షిప్ బిడ్ కూడా భారీగానే వుండనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle