ఐపీఎల్ మొదటి మ్యాచ్ ను ఎంత మంది చూశారో తెలుసా..?
22-09-202022-09-2020 17:48:13 IST
Updated On 22-09-2020 18:11:48 ISTUpdated On 22-09-20202020-09-22T12:18:13.244Z22-09-2020 2020-09-22T12:18:08.773Z - 2020-09-22T12:41:48.715Z - 22-09-2020

ఐపీఎల్-2020 మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో పండగ చేసుకుంటూ ఉన్నారు. భారీ స్థాయిలో మ్యాచ్ ను వీక్షిస్తూ ఉన్నారు. ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! ఈ మ్యాచ్ ను భారీ స్థాయిలో చూశారట. ఆ విధంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ టీవీ వీక్షణల పరంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రారంభ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో 20 కోట్ల మంది చూశారట. ఐపీఎల్ చరిత్రలోనే డిజిటల్ వ్యూస్ పరంగా ఇది రికార్డు అని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు.
అసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ లేకుండా క్రికెట్ అభిమానులు ఎంతగానో డీలా పడిపోయారు. ఇలాంటి సమయంలో ఐపీఎల్ మొదలవ్వడంతో ఓపెనింగ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు, ఐప్యాడ్లు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ , ముంబయి ఇండియన్స్ మ్యాచ్ అంటే చాలు భారీ స్థాయిలో వ్యూవర్ షిప్ ఉంటుంది. ఐపీఎల్ మొదటి మ్యాచ్ కూడా అదే కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు టీవీలకు అతుక్కుపోయారని వ్యూవర్ షిప్ ను చూస్తే అర్థమవుతుంది.
ఐపీఎల్-13 వ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. అంబటి రాయుడు(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) డుప్లెసిస్(58 నాటౌట్; 44 బంతుల్లో 6 ఫోర్లు) చెన్నైకు విజయాన్ని అందించాడు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో రాయుడు, డుప్లెసిస్‌లు ఆదుకున్నారు. ఈ జోడి 115 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆల్‌రౌండర్ సామ్ కరాన్ ఆరు బంతుల్లో రెండు సిక్స్‌లు, 1 సిక్స్‌తో మ్యాచ్ ను మలుపుతిప్పాడు. బౌల్ట్ వేసిన 20 ఓవర్ తొలి రెండు బంతుల్ని డుప్లెసిస్ వరుసగా ఫోర్లు కొట్టడంతో చెన్నై ఇంకా నాలుగు బంతులు ఉండగా విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
13 hours ago

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
15-04-2021

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
15-04-2021

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
15-04-2021

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
14-04-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021
ఇంకా