newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

20-05-202020-05-2020 10:02:08 IST
2020-05-20T04:32:08.748Z20-05-2020 2020-05-20T04:32:03.971Z - - 16-04-2021

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా అన్ని క్రీడాపోటీలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా అమలులోకి వచ్చిన లాక్ డౌన్ 4.O సందర్భంగా క్రీడాభిమానులు ఐపీఎల్ 2020 పై ఆశలు పెట్టుకున్నారు. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ పెద్దలు ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షా కాలం కావడంతో అంతరాయం లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాదు. సుమారు రెండు నెలలు సాగే ఐపీఎల్‌ను ఈ ఏడాదే ముగించాలంటే అక్టోబరు- నవంబరు సరైన సమయమని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్టు సమాచారం.

అదే సమయంలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. ఈ క్రీడాపోట భవిష్యత్తుపై ఈనెల 28న జరిగే బోర్డు సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ప్రపంచకప్‌ వాయిదా పడితే అక్టోబరు- నవంబరులో ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందని బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఆశగా వున్నాయి. కేంద్రం తాజాగా జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో క్రీడాకారులకు భారీ ఊరట లభించింది. రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. ఇకపై చక్కగా మైదానాల్లో ప్రాక్టీసు మొదలుపెట్టవచ్చు.

లాక్ డౌన్ 4.0లో స్టేడియంలు, క్రీడా సముదాయాలను తెరుచుకోవచ్చునని.. కానీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనితో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారికి ఇది పెద్ద ఊరటను ఇచ్చే అంశమే అంటున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ శిక్షణా శిబరాలన్నీ తెరుచుకోనుండగా.. ప్రభుత్వం నుంచి మరిన్ని మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే క్రీడా సముదాయాలా లేక శిక్షణ కేంద్రాలను మాత్రమే తెరవాలా అనే విషయంపై క్లారిటీ వస్తుందని భారత ఒలింపిక్ సంఘం అంటోంది.

మరోవైపు ప్రేక్షకులు లేకుండా స్టేడియంలు తెరుచుకునేందుకు కేంద్రం ఛాన్స్ ఇవ్వడంతో.. వాయిదా పడిన ఐపీఎల్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో బీసీసీఐ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బోర్డు అభిమానులు లేకుండా అతి కొద్ది స్టేడియంలలో తక్కువ మ్యాచులతో ఐపీఎల్ 13ను నిర్వహించాలని గతంలోనే ఆలోచన చేసిది.  దానికి తగ్గట్టు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. ఇప్పుడు ఐపీఎల్ 2020 పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

 

IPL 2021: కింద మీద పడి  గెలిచిన  రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   8 hours ago


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   10 hours ago


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   14 hours ago


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15 hours ago


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   13 hours ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   19 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   a day ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle