newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్, దేశవాళీ టోర్నీలు మొత్తంగా రద్దు.. బీసీసీఐ కీలక నిర్ణయం

15-03-202015-03-2020 09:07:56 IST
2020-03-15T03:37:56.012Z15-03-2020 2020-03-15T03:37:48.357Z - - 14-05-2021

ఐపీఎల్, దేశవాళీ టోర్నీలు మొత్తంగా రద్దు.. బీసీసీఐ కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా  వర్తకం, వాణిజ్యం, ఔషధ, పర్యాటకం తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రత ఇప్పుడు క్రీడా రంగాన్ని కూడా వణికిస్తోంది.  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం ఒక్కో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతూ వస్తోంది. వారం రోజులుగా పలు స్పోర్ట్స్‌ ఈవెంట్‌లు రద్దు అవుతుండగా, ఈ సెగ ఇప్పుడు బీసీసీఐని కూడా తాకింది. నిన్న ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..  దక్షిణాఫ్రికాతో జరగాల్సిన ఉన్న వన్డే సిరీస్‌కు కూడా గుడ్‌ బై చెప్పేసింది. తాజాగా దేశవాళీ టోర్నీలు అన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసింది. 

ఈనెల 18వ తేదీన ఆరంభం కావాల్సిన ఇరానీ కప్‌తో పాటు సీనియర్‌ వుమెన్స్‌ వన్డే నాకౌట్‌ టోర్నీ, విజ్జీ ట్రోఫీ, సీనియర్‌ వుమెన్స్‌ వన్డే చాలెంజర్‌, వుమెన్స్‌ అండర్‌-19 వన్డే నాకౌట్‌, వుమెన్స్‌ అండర్‌-19 టీ20 లీగ్‌ ఇలా అన్ని టోర్నీలను బీసీసీఐ వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ వీటి వాయిదా కొనసాగనుంది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

శుక్రవారం ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏప్రిల్‌ 15 వరకు విదేశీయులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో విదేశీ క్రికెటర్లు అప్పటివరకూ ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చే చాన్స్‌ లేకుండా పోయింది. 

మరొకవైపు పలు రాష్టాలు కూడా ఐపీఎల్‌ నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఐపీఎల్‌ వాయిదా పడింది. అదే సమయంలో దేశవాళీ టోర్నీలతో పాటు భారత్‌ ఆడాల్సిన పలు టోర్నీలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ప్రస్తుత పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తర్వాతే టోర్నీల నిర్వహణపై ముందుడుగు వేయాలనేది బీసీసీఐ యోచన. దీనిలో భాగంగా ప్రతీవారం కరోన్‌ వైరస్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. దాంతో బీసీసీఐ తాత్కాలికంగా షట్‌డౌన్‌ అయినట్లే.

‘ప్రస్తుతం ఐపీఎల్‌ గురించి నేనేమీ చెప్పలేను. అప్పటికి ఉండే పరిస్థితుల్ని బట్టే ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఏప్రిల్‌ 15నాటికి పరిస్థితులు చక్కబడితే ఐపీఎల్‌ను కుదిస్తాం. ఇంతవరకే నేను చెప్పగలను. కాకపోతే ఎన్ని మ్యాచ్‌లు ఉంటాయి. ఎలా ఉంటాయి అనేది ఇప్పుడేమీ చెప్పలేను’ అని ఈరోజు జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ సమావేశం తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యానించాడు. ముంబైలో జరిగిన సమావేశం తర్వాత మీడియా ముందు హాజరైన గంగూలీ తనకు ఎదురైన ఒక ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు.

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29వ తేదీ నుంచి ఐపీఎల్‌ జరగాల్సి ఉండగా, కరోనా వైరస్‌ ప్రభావంతో దాన్ని ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ వాయిదా వేశారు. ఐపీఎల్‌ నిర్వహణపై ఈ రోజు గవర్నింగ్‌ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినా అప్పటి పరిస్థితుల్ని బట్టే నిర్ణయం తీసుకోవాలని గంగూలీ మాటల్ని బట్టి అర్ధమవుతుంది. 

ప్రస్తుతం క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నిర్వహణ అనేది కరోనా వైరస్‌ తీవ్రతపైనే ఆధారపడుతుందనే కాదనలేని సత్యం. వచ్చే నెల రెండో వారం నాటికి కరోనా ప్రభావం తగ్గితే ఐపీఎల్‌పై ముందుకు వెళతారు.. ఒకవేళ ఇదే అనిశ్చితి ఉంటే మాత్రం​ ఆ లీగ్‌ జరగకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కరోనా వైరస్‌ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో ఐపీఎల్‌ను వేరే దేశాల్లోనే తటస్థ వేదికల్లో నిర్వహించే మార్గాలు కూడా లేవు. దీనికి కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడమే ఒక్కటే మార్గం.

పలు దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ దేశాల్లో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసుకోవడం తెలిసిందే.

 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle