newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ 'థీమ్' సాంగ్‌ పై కాపీ వివాదం..

10-09-202010-09-2020 15:37:43 IST
2020-09-10T10:07:43.551Z10-09-2020 2020-09-10T10:07:27.510Z - - 14-04-2021

ఐపీఎల్ 'థీమ్' సాంగ్‌ పై కాపీ వివాదం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)-13వ సీజన్‌ ఈ ఏడాది యూఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసేసింది బీసీసీఐ. ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. సెప్టెంబర్‌ 19న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్‌తో సీజన్‌ ప్రారంభం కానుంది. ఎన్నో ఒడిదొడుకుల‌ను దాటి క‌రోనా క‌ష్ట‌కాలంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వ‌హిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా క‌రోనాపై పోరాటం చేస్తూ ఈ టోర్నీ మ‌ళ్లీ భార‌త్‌లోనే నిర్వ‌హించ‌బ‌డుతుంద‌నే ఆత్మ‌విశ్వాసంతో నిండిన ఓ థీమ్ సాంగ్‌ను ఇటీవల ఐపీఎల్ విడుద‌ల చేసింది.

ఈ పాట‌కు క్రికెట్ అభిమానుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుండ‌గా.. ముఖాలకు మాస్కులు, ఒకరికొకరు దూరం, శానిటైజర్లు రుద్దుకోవడం వంటి అంశాలు అన్ని ఆ పాటలో ఉన్నాయి. “ఆయేంగే హ‌మ్ వాప‌స్‌” అనే లిరిక్స్‌తో సాగిన ఈ పాట ఆద్యంతం క్రికెట్ అభిమానుల‌ను అల‌రిస్తోంది.

ఇదిలా ఉంటే.. తన పాటను కాపీ చేసి దీనిని రూపొందించారని ర్యాపర్‌ కృష్ణ కౌల్‌ ఆరోపించారు. 'దేఖ్‌ కౌన్‌ ఆయా' వాపస్‌కు ఇది నకలుగా ఉందని పేర్కొన్నారు. ఈ పాటను తాను 2017లో రూపొందించానని తెలిపాడు. కాగా.. అతడి ఆరోపణలను ఐపీఎల్‌ గీతం రూపకర్త ప్రణవ్‌ అజయ్‌ రావ్‌ మాల్ప్‌ ఖండించారు. ఈ పాటను స్వయంగా రూపొందించానని.. ఎవరికి పాటను కాపీ చేయలేదన్నారు. నేను, నా జట్టు ఎంతో కష్టపడి దీనిని రూపొందించామన్నారు. ఎంసీఏఐ(భారత సంగీత రూపకర్తల సంఘం) ధ్రువప్రతం సైతం మంజూరు చేసిందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం #IPLAnthemCopied అనే హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ అవుతుండడం గమనార్హం.

 

https://twitter.com/IPL/status/1302626834878611457?s=20


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle