newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ కు వార్న్ వచ్చేశాడు..!

14-09-202014-09-2020 16:16:39 IST
2020-09-14T10:46:39.322Z14-09-2020 2020-09-14T10:46:35.637Z - - 19-04-2021

ఐపీఎల్ కు వార్న్ వచ్చేశాడు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొదటి ఐపీఎల్ సీజన్ ను సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సారథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ అందుకుంది. ఆ తర్వాతి నుండి అంత గొప్ప ప్రదర్శన రాజస్థాన్ జట్టు ఎన్నడూ చేయలేదు. ప్రతి సారీ జట్టు మీద అంచనాలు ఉంటాయి కానీ.. జట్టులో చిన్న లోపం టైటిల్ ను దక్కనివ్వకుండా చేస్తోంది. ఈసారి మాత్రం టైటిల్ ను తప్పకుండా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో రాజస్థాన్ రాయల్స్ అన్ని విషయాల్లోనూ తమదైన ప్లానింగ్స్ తో దూసుకుపోతోంది. అందుకే షేన్ వార్న్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది.

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ప్రచారకర్తగా ఉన్న షేన్‌వార్న్‌ యువ ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు టీమ్‌ మెంటార్‌గా ఎంపిక చేసినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. టీమ్‌ కోచ్, తన విక్టోరియా జట్టు మాజీ సహచరుడు అయిన ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి వార్న్‌ పని చేయనున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు నాకు ఓ కుటుంబం లాంటిది..

ఆ జట్టుతో మళ్లీ జత కట్టడం సంతోషంగా ఉందని షేన్ వార్న్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. రాబోయే నెలలు జట్టుకు చాలా ముఖ్యమైనవని అన్నాడు వార్న్.

అంతర్జాతీయంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకోడానికి కూడా వార్న్ ఫ్రాంచైజీకి ఉపయోగపడనున్నాడు.  వార్న్ కు ఉన్న క్రికెట్ నాలెడ్జ్ జట్టుకు ఎంతో ఉపయోగపడనుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో యువ ఆటగాళ్ళు ఎక్కువగా ఉన్నారు.. వారందరినీ స్టార్స్ చేయడానికి వార్న్ కూడా ఉపయోగపడతాడని యాజమాన్యం నమ్ముతోంది.

సీజన్ ఐపీఎల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతూ ఉండడం వలన స్పిన్ ముఖ్య పాత్ర పోషించనుంది. అందుకే వార్న్ సూచనలు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఉపయోగపడనున్నాయి. వార్న్ ప్రస్తుతం కామెంట్రేటర్ గా కూడా ఎంతో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ లో అటు కామెంట్రీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ మొదలుకాబోతోంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle