newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి

11-08-202011-08-2020 09:25:17 IST
2020-08-11T03:55:17.954Z11-08-2020 2020-08-11T03:52:47.850Z - - 10-04-2021

ఐపీఎల్ కి కేంద్రం అధికారిక అనుమతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌‌‌కి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి లభించినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ సోమవారం వెల్లడించాడు.సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. ఈ మేరకు మ్యాచ్‌ల షెడ్యూల్‌పై కసరత్తలు చేస్తోంది. 

యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించేందుకు హోమ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి కోరుతూ ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లేఖలు పంపగా.. వాటికి తాజాగా సమాధానం వచ్చింది.

విదేశాల్లో టోర్నీలు నిర్వహించే సమయంలో హోమ్, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి వచ్చింది.ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి చైనాకి చెందిన మొబైల్ కంపెనీ వివోని ఇటీవల తప్పించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. కొత్త స్ఫాన్సర్‌ కోసం బిడ్స్‌ని కూడా ఆహ్వానించింది. ఈ మేరకు ఇప్పటికే రేసులో అమెజాన్, పతాంజలి, జియో, బైజ్యూస్ తదితర కంపెనీలు ఉండగా.. ఈ గడువు మరో వారం రోజుల్లో ముగియనుంది. మొత్తంగా.. ఈ నెల 18న కొత్త స్ఫాన్సర్ ఎవరనేది..? తేలిపోతుందని బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ టైటిల్ పతంజలికి దక్కేనా?

యూఏఈ వేదికగా 53 రోజుల విండోలో మొత్తం 60 ఐపీఎల్ మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుండగా.. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండే అవకాశం ఉంది. వివో తరహాలో టైటిల్ స్ఫాన్సర్‌‌కి ఈ సీజన్‌కి రూ. 440 కోట్లు కాకపోయినా.. కనీసం రూ. 180-200 కోట్లు బీసీసీఐకి వచ్చే అవకాశం ఉంది. యూఏఈలోని షార్జా, అబుదాబి, దుబాయ్ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle