ఐపీఎల్ అప్ డేట్: ఆటగాళ్ళ భౌతిక దూరంపై.. బ్లూటూత్ నిఘా
28-08-202028-08-2020 10:40:31 IST
Updated On 28-08-2020 13:32:06 ISTUpdated On 28-08-20202020-08-28T05:10:31.622Z28-08-2020 2020-08-28T05:10:07.088Z - 2020-08-28T08:02:06.742Z - 28-08-2020

కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే జట్లన్నిటినీ దుబాయ్‌కు తరలించి క్వారంటైన్లో ఉంచింది. కోవిడ్-19 నిబంధనలను కూడా కఠినంగా అమలు చేస్తుంది. ప్రస్తుతం అన్ని జట్ల ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఇప్పటికైతే ఒకరి గదిలోకి మరొకరు వెళ్లరాదు. బయోబబుల్ వాతావరణంలో ఉంటున్నా ఆటగాళ్లు భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ హేమంగ్ అమిన్ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో ఆటగాళ్ల కోసం బీసీసీఐ పలు సూచనలు చేసింది. టీమ్ రూమ్, జిమ్, ప్రైవేట్ బీచ్, తమ గది తలుపుల దగ్గర ఆటగాళ్లు కలిసేందుకు అనుమతి ఉంది. అయితే అలాంటి సమయంలోనూ కచ్చితంగా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. ఇందుకోసం క్రికెటర్లు ప్రత్యేక బ్లూటూత్ పరికరాన్ని చేతికి ధరించాల్సి ఉంటుంది. రిస్ట్ బ్యాండ్‌లా ఉండే ఈ పరికరం ఎవరైనా భౌతిక దూరం నిబంధన ఉల్లంఘిస్తే శబ్దంతో అలర్ట్ చేస్తుంది. మిగతా అన్నివేళల్లో ధరించాలని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు వస్తే వారు కూడా దీన్ని ధరించాల్సిందే. టీమ్ బస్సుల్లోనూ జిగ్‌జాగ్ పద్దతిలో క్రికెటర్లు కూర్చోవాలని చెప్పింది. టీవీ క్రూ మొత్తం పీపీఈ కిట్లు ధరించాలని కూడా స్పష్టం చేసింది. ఆటగాళ్లు ఒకరి గదులు ఇంకొకరు వెళ్లకూడవద్దనేది కష్టమని రాజస్థాన్ రాయల్స్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ అభిప్రాయపడ్డాడు. ఇన్నాళ్లు ఇంటికి పరిమితమై.. ఇప్పుడు కూడా గదిల్లో ఉండటం ఇబ్బందిగా ఉందన్నాడు. ఇక 53 రోజుల పాటు లీగ్ జరుగుతుండటంతో ఆటగాళ్లకు హెయిర్ కట్కు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఇది ముందే ఊహించిన ముంబై ఇండియన్స్ ఏకంగా ఓ హెయిర్ స్టైలిస్ట్‌నే తమతో దుబాయ్‌కు తీసుకెళ్లింది. ఇతర ఫ్రాంచైజీలు కొన్ని దుబాయ్‌లో స్థానిక హెయిర్ స్టైలిస్ట్‌లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
12 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
16 hours ago

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
a day ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
14-04-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021
ఇంకా