newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్‌ నిరవధిక వాయిదా.. క్రికెట్ ఫ్యాన్స్ షాక్

15-04-202015-04-2020 13:19:08 IST
Updated On 15-04-2020 14:23:01 ISTUpdated On 15-04-20202020-04-15T07:49:08.480Z15-04-2020 2020-04-15T07:48:12.955Z - 2020-04-15T08:53:01.353Z - 15-04-2020

ఐపీఎల్‌ నిరవధిక వాయిదా.. క్రికెట్ ఫ్యాన్స్ షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రీడాభిమానులకు ఇది షాకింగ్ న్యూసే. ఎందుకంటే వేసవి కాలంలో క్రీడా వినోదం పంచే ఐపీఎల్ ఇక లేనట్టే. ఈ  ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ జరగడం మరింత కష్టంగా మారింది. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వివిధ ఫ్రాంఛైజీలకు చెప్పింది. కరోనా మహమ్మారిపై పోరాటం కోసం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

‘‘టోర్నీని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ మాకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ ఏడాది చివర్లో టోర్నీ నిర్వహణ సాధ్యమవుతుందనే ఆశాభావంతో బోర్డు ఉంది’’ అని ఓ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు చెప్పారు. ఐపీఎల్ మే నెలలో నిర్వహించే అవకాశాలున్నాయని తొలుత సమాచారం వచ్చింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా క్రీడలు జరిగే అవకాశం ఎక్కడ ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహించడం కష్టమని దాదా ఇప్పటికే కామెంట్ చేశాడు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదే పరిస్థితి మే నెలవరకూ ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతోంది.

ఈ నేపథ్యంలో ఆటగాళ్లు విదేశాలు నుంచి ఎలా వస్తారు? అన్ని దేశాల విదేశీ పర్యటనలు, క్రీడాకారులు, టూరిస్టులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌ అనే కాదు ప్రపంచంలో ఏ క్రీడలు జరగడం లేదన్నారు. సరైన సమయంలో నిర్ణయం వెలువరిస్తామన్న గంగూలీ ఎట్టకేలకు వాయిదా నిర్ణయం ప్రకటించాడు. దీంతో క్రీడాభిమానులు బాగా అప్ సెట్ అవుతున్నారు. 

ఇండియాలో ఏం జరగట్లేదు.. ఐపీఎల్ సంగతి ఎందుకు?


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle