newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్

13-08-202013-08-2020 14:03:27 IST
Updated On 13-08-2020 14:27:56 ISTUpdated On 13-08-20202020-08-13T08:33:27.600Z13-08-2020 2020-08-13T08:33:24.842Z - 2020-08-13T08:57:56.111Z - 13-08-2020

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కరోనా  బోణీ.. రాజస్తాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌‌కు పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక జట్టు కూడా ఇంకా మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఒక బంతి కూడా బౌలర్ సంధించలేదు. తానీ ఐపీఎల్‌ని కరోనా అప్పుడే పలకరించేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న దిశాంత్‌ యాజ్ఞిక్‌కు కరోనా వచ్చినట్లు తేలింది. దీంతో నాలుగు నెలలు ఆలస్యంగా అయినా సరే ఐపీఎల్ మజాను యూఏఈలో చూస్తూ ఆస్వాదించాలనుకున్న ప్రేక్షకుడి గుండెల్లో రాయి పడింది. అంతకు మించి ఆలస్యంగా నైనా సరే ఐపీఎల్ కొనసాగుతుందా అని జట్టు ప్రాంచైజీలు, క్రికెటర్లలో ఆందోళన మొదలైపోయింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020 కోసం బీసీసీఐనుంచి ఫ్రాంచైజీల వరకు అంతా సిద్ధమైపోతున్నారు... యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆగస్టు 20 నుంచి ఒక్కో జట్టు యూఏఈ వెళ్లేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సమయంలో నిర్వాహకులను ఇబ్బంది పెట్టే వార్త ఇది. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న దిశాంత్‌ యాజ్ఞిక్‌కు కరోనా వచ్చినట్లు స్వయంగా ప్రకటించాడు.

కోవిడ్‌–19 పరీక్షలో తనకు పాజిటివ్‌గా వచ్చినట్లు అతను ప్రకటించాడు. యూఏఈ బయల్దేరడానికి ముందు జట్టు సభ్యులందరినీ ఒకే చోట చేర్చే క్రమంలో తాము పరీక్షలు నిర్వహించామని, ఇందులో యాజ్ఞిక్‌ పాజిటివ్‌గా తేలినట్లు రాయల్స్‌ యాజమాన్యం వెల్లడించింది. అయితే గత పది రోజుల్లో అతనికి దగ్గరగా జట్టులోని ఏ ఆటగాడు వెళ్లలేదని కూడా ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.  

అయితే ఐపీఎల్‌ ఆరంభానికి నెలకు పైగా సమయముంది కాబట్టి దిశాంత్‌ యాజ్ఞిక్‌కు కరోనా రావడం ప్రస్తుతానికి జట్టుపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే టీమ్‌ ప్రణాళికలు కచ్చితంగా దెబ్బ తింటాయి. క్వారంటీన్‌తో పాటు సన్నాహకాల కోసమే ఐపీఎల్‌ జట్లు దాదాపు నెల రోజులు ముందుగా యూఏఈ వెళుతున్నాయి. 

ఇలాంటి స్థితిలో ఫీల్డింగ్‌ కోచ్‌ ఆలస్యంగా జట్టుతో చేరితే అది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పుడు దిశాంత్‌ 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ క్వారంటైన్‌లో గడపాల్సి ఉంది. ఆ తర్వాత అతను భారత్‌లోనే రెండు సార్లు కోవిడ్‌–19 పరీక్షలకు హాజరు కావాలి. ఆ రెండు నెగెటివ్‌గా వస్తేనే యూఏఈ విమానమెక్కుతాడు. 

అక్కడికి చేరాక నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటీన్‌లో ఉండి మరో మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అప్పటి వరకు ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ సేవలు కోల్పోయినట్లే. ప్రతికూల పరిస్థితుల మధ్య ఐపీఎల్‌కు సన్నద్ధమైన బీసీసీఐ, ఫ్రాంచైజీలకు తాజా పరిణామం ఒక హెచ్చరికలాంటిదే.

ఇక్కడినుంచి బయల్దేరడానికి ముందునుంచి లీగ్‌ ముగిసే వరకు వారు ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో ఈ ఉదంతం చూపించింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle