newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఐపీఎల్‌ ఆతిథ్యానికి పోటాపోటీ.. బరిలో తాజాగా న్యూజిలాండ్‌

07-07-202007-07-2020 12:49:32 IST
Updated On 07-07-2020 14:42:44 ISTUpdated On 07-07-20202020-07-07T07:19:32.487Z07-07-2020 2020-07-07T07:19:30.331Z - 2020-07-07T09:12:44.273Z - 07-07-2020

ఐపీఎల్‌ ఆతిథ్యానికి పోటాపోటీ.. బరిలో తాజాగా న్యూజిలాండ్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐకి మరో ఆఫర్ వచ్చింది. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇప్పటికే యూఏఈ, శ్రీలంక ముందుకు రాగా, తాజాగా న్యూజిలాండ్ కూడా రేసులో దిగింది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే తాము ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీసీసీఐకి తెలియజేసింది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా ప్రకటన త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఒకే ఒక్క కరోనా కేసు యాక్టివ్‌గా ఉంది.  

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి29న ప్రారంభమవ్వాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ను లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్.. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది భారత్‌లో జరిగే అవకాశం కనిపించకపోవడంతో ఐపీఎల్ 2020 సీజన్‌ని విదేశాల్లోనూ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. 

అయితే ఇప్పటికే ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని యూఏఈ, శ్రీలంక దేశాలు ముందుకు రాగా.. తాజాగా ఈ జాబితాలోకి న్యూజిలాండ్‌ కూడా చేరింది. బీసీసీఐ ముందుకొస్తే ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని న్యూజిలాండ్‌ పేర్కొంది. న్యూజిలాండ్‌లో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో.. టోర్నీ నిర్వహించేందుకు ఆ దేశం ముందుకొచ్చింది.

దీనిపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ టోర్నీని ఇండియా నిర్వహించాలనే మా మొదటి ప్రాధాన్యత. ఇక్కడ సాధ్యం కాని పరిస్థితుల్లో విదేశాల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తాం. యూఏఈ, శ్రీలంక తర్వాత న్యూజిలాండ్ కూడా తమ దేశంలో ఐపీఎల్ నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. భాగస్వాములందరితోనూ సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్ల భద్రతే అన్నింటికన్నా ముఖ్యమైనది. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’. అని పేర్కొన్నారు. కాగా గతంలోనూ పలుసార్లు ఐపీఎల్‌ టోర్నీని విదేశాల్లో నిర్వహించారు. 2009 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించగా, ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్‌‌లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది.

స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నా దేశంలో శరవేగంగా పెరుగుతున్న కేసులు ప్రపంచంలోనే భారత్‌ను మూడో స్థానంలో నిలబెట్టాయి. దీంతో సెప్టెంబరు చివర్లో, లేదంటే నవంబరు మొదట్లో ఐపీఎల్ నిర్వహించాలనుకున్న బీసీసీఐ ఆశలు దాదాపు అడుగంటాయి. తమ మొదటి ప్రాధాన్యం ఇండియానే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ ఇక్కడ నిర్వహించడం సురక్షితం కాదని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యూఏఈ, శ్రీలంక తర్వాత ఇప్పుడు ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు న్యూజిలాండ్ ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. బ్రాడ్‌కాస్టర్లు, జట్లతో సమావేశమైన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని, తమకు ఆటగాళ్ల భద్రతే అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పుకొచ్చారు.  

టి20 ప్రపంచకప్‌ వాయిదా పడినట్లే..!

కరోనా తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ వాయిదా పడనుందనే ఊహాగానాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం సన్నద్ధమవ్వాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆదేశాలు వచ్చినట్లు స్థానిక మీడియా ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత ఊతం లభించినట్లయింది. ఆసీస్‌ మీడియా కథనాల ప్రకారం లాజిస్టిక్‌ సమస్యల కారణంగా అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ వాయిదా వేసేందుకు ఐసీసీ సిద్ధమైందని... వారంలోపు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో అక్టోబర్‌–నవంబర్‌ సమయాన్ని ఐపీఎల్‌ కోసం కేటాయించే అవకాశముంది. ‘టి20 వరల్డ్‌కప్‌ వాయిదాపై ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం సిద్ధమవ్వాలని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సమాచారం ఇచ్చారు. కానీ సిరీస్‌ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత నేరుగా అక్కడి నుంచే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్‌ కోసం భారత్‌ చేరుకుంటారు’ అని మీడియాలో వార్తలు వచ్చాయి.   


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle