newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఐపీఎల్‌లో బెంగళూరు ప్రక్షాళన... కోహ్లీకి ఇబ్బంది ఉంటుందా?

20-09-201920-09-2019 10:56:48 IST
2019-09-20T05:26:48.446Z20-09-2019 2019-09-20T05:26:46.105Z - - 20-10-2019

ఐపీఎల్‌లో బెంగళూరు ప్రక్షాళన...  కోహ్లీకి ఇబ్బంది ఉంటుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడతాడు.. కష్టాల్లో ఉన్న జట్టును విజయతీరానికి చేరుస్తాడు.. కుర్రాళ్లలో పోరాటపటిమను నింపుతాడు!

ఇవన్నీ టీమిండియాకు ఆడేటప్పుడే వర్తిస్తాయి. ఎందుకంటే ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దగ్గర మాత్రం కోహ్లీ పప్పులు ఉడకడం లేదు. ఎంత కష్టపడినా, ఆఖరికి ఓపెనర్‌ అవతారం ఎత్తినా జట్టుకు ట్రోఫీ రావడం లేదు. అంతేకాదు... పాయింట్ల పట్టిలో ఆఖరి రెండు స్థానాల కోసం ఆర్‌సీబీ పోటీ పడుతోంది. చాలా ఏళ్ల నుంచి ఇదే సాగుతోంది. ఇప్పుడు ఆర్‌సీబీ జట్టును ప్రక్షాళన చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే సహాయక సిబ్బంది మొత్తాన్ని మార్చేసింది. ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉంటూ సీజన్‌ను ముగిస్తూ వచ్చిన ఆర్‌సీబీ ఈ సారి ఎలాగైనా విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించిన విరాట్‌ కోహ్లీ బెంగళూరుకు మాత్రం ఆ స్థాయిలో ఉపయోగపడలేకపోయాడు. ఏబీ డివిలియర్స్‌, ఒకప్పుడు క్రిస్‌గేల్‌, కేఎల్‌ రాహుల్‌ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కోహ్లీ ఆర్‌సీబీని విజేతగా నిలపలేకపోయాడు. దీంతో అతనిపై విమర్శలు పెరిగాయి. కెప్టెన్సీ తప్పించాలని కొందరు అభిమానులు బహిరంగంగానే విమర్శించారు కూడా. అయితే జట్టు డైరెక్టర్‌ మైక్ హెసన్ మాత్రం కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించే పరిస్థితే లేదంటున్నాడు. 

‘‘పరిస్థితులను విరాట్‌ కోహ్లీనే మార్చగలడని మేం అనుకోవడం లేదు. ఇన్నాళ్లు ఆడిన ఆట చూసి ఆయన ఏం తప్పులు చేశాడో తెలుసుకొని ఉండొచ్చు. సారథ్యం మార్పుపై ప్రధాన కోచ్‌ సైమన్‌ కటిచ్‌తో  ఎలాంటి చర్చ జరగలేదు. ఆటగాళ్లపైనే ఎక్కువ దృష్టిసారించాం. ఈ ఏడాది వేలం ముగియగానే జట్టు పని ఆరంభిస్తాం. విజయ్‌ హజారే, ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కుర్రాళ్లు ఎలా ఆడతారో చూస్తాం. అందులోంచి మేం అనుకున్న వాళ్లను ఎంపిక చేసుకుంటాం’’ అని మైక్ హెసన్ స్పష్టం చేశాడు. 

ఇక కొత్త సహాయ సిబ్బంది విషయానికొస్తే... విరాట్‌ కోహ్లీకి ఇష్టమైన టీమిండియా మాజీ స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు తిరిగి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శిబిరంలో చేరాడు. బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకోక ముందు అతడు ఆర్‌సీబీకే పనిచేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు మాజీ క్రికెటర్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ బ్యాటింగ్‌, స్పిన్‌ బౌలింగ్‌ సలహాదారుగా ఎంపికయ్యాడు. బౌలింగ్‌ కోచ్‌గా ఆడమ్‌ గ్రాఫిత్‌ (ఆస్ట్రేలియా)ను ఎంచుకున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle