newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్‌లో బుమ్రాను మించిన బౌలర్..

13-09-202013-09-2020 09:40:34 IST
2020-09-13T04:10:34.659Z13-09-2020 2020-09-13T04:10:26.864Z - - 15-04-2021

ఐపీఎల్‌లో బుమ్రాను మించిన బౌలర్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్‌ 13 సీజన్‌లో బుమ్రాను మించిన బౌలర్ ఉన్నాడని కేకేఆర్ మెంటర్ డేవిడ్ హస్సీ ఉన్నట్లుండి బాంబు పేల్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున అటు ఓపెనర్‌గానూ, ఇటు ప్రధాన స్పిన్నర్‌గాను కీలక పాత్ర పోషిస్తున్న సునీల్‌ నరైన్‌పై ఆ జట్టు మెంటార్‌ డేవిడ్‌ హస్సీ ప్రశంసలు కురిపించాడు. కేకేఆర్‌కు నరైన్‌ కీలక ఆటగాడంటూ కొనియాడాడు. అసలు నరైన తమ జట్టులో ఉండటం అదృష్టమన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ బౌలింగ్‌ చేసే బౌలర్‌ అన్నాడు. ప్రత్యేకంగా వరల్డ్‌ టీ20 బౌలర్లలో నరైన్‌ ఒకడన్నాడు. 

ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ ఎవరంటే నా దృష్టిలో సునీల్ నరైన్ మాత్రమే. నరైన్‌ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. బౌలింగ్‌లో స్పిన్‌ మ్యాజిక్‌తో కీలక వికెట్లు సాధిస్తూ మంచి బ్రేక్‌ ఇస్తూ ఉంటాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఎక్కడైనా బ్రేక్‌ ఇవ్వడంలో నరైన్‌ది ప్రత్యేక స్థానం. కేకేఆర్‌ జట్టులో నరైన్‌ ఉండటం మా అదృష్టం.

జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉంటే కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌కు వెంటనే గుర్తుచ్చే బౌలర్ సునీల్ నరైన్‌. ఈసారి ఐపీఎల్‌లో కూడా నరైన్‌దే కీలక పాత్ర. హోరాహోరీ పోరులో నరైన్‌దే పైచేయి అవడం ఖాయం. యూఏఈలో స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం నరైన్‌కు కలిసొచ్చే అంశం అని హస్సీ తెలిపాడు.

కేకేఆర్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌ నరైన్‌. 119 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు సాధించాడు. గతేడాది ఐపీఎల్‌లో నరైన్‌ 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో 166.27తో 143 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. గౌతం గంభీర్‌ సారథ్యంలో కేకేఆర్‌ 2012, 2014ల్లో టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత 2016, 17, 18ల్లో ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రంసాధించలేకపోయింది. 

ఇటీవలే ముగిసిన కరీబీయన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో చాంఫియన్స్ అయిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడిన సునీల్ నరైన్ 5 మ్యాచు‌లల్లో 6 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేటు 4.55 గా ఉండటం గమనార్హం.

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   11 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   15 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   a day ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle