newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఐపీఎల్‌లో జాతీయ గీతాలాపన.. విదేశాల్లో మ్యాచ్‌లు...నెస్ వాడియా సలహా

08-11-201908-11-2019 12:45:47 IST
2019-11-08T07:15:47.130Z08-11-2019 2019-11-08T07:15:36.842Z - - 27-05-2020

ఐపీఎల్‌లో జాతీయ గీతాలాపన.. విదేశాల్లో మ్యాచ్‌లు...నెస్ వాడియా సలహా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పది మంది ఒక చోట చేరితే అక్కడ జాతీయ గీతాలాపన చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గత కొన్ని నెలలుగా జాతీయ గీతాలాపన జరుగుతోంది. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా ప్రతి మ్యాచ్‌ ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలనే వాదన ఒకటి బయటికొచ్చింది. గతంలోనే ఒకసారి ఈ తరహా ప్రతిపాదన బీసీసీఐ ముందుకు వచ్చినా అప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రతిపాదన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ముందుకు వచ్చింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌వాడియా ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు. 

ఐపీఎల్‌ సిరీస్‌కు ముందు జరిగే వేడుకల విషయంలోనూ నెస్‌వాడియా స్పందించాడు. వాటి రద్దు సరైన చర్య అని ఆయన అన్నాడు.  ‘‘ఐపీఎల్‌లో ప్రారంభోత్సవ వేడుక అవసరం లేదు. ఇన్నాళ్లూ అసలు ఈ వేడుక అవసరమా అని ఆలోచిస్తూ ఉండేవాడిని.

ఇన్నాళ్లకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో  బీసీసీఐ మరో పని చేయాలి. ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌ ముందు జాతీయ గీతాలాపన చేయించాలి. ఈ విషయమై గతంలోనూ నేను బీసీసీఐకి లేఖ రాశాను. ఇప్పుడు మరోసారి సౌరవ్‌ గంగూలీకి రాశాను. మన జాతీయ గీతం ఆలపించి, విని,  గర్వించాలి. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌, ప్రొ కబడ్డీ లీగ్‌ల్లో ప్రతి మ్యాచ్‌కు ముందు పాడతారు. ఎన్‌బీఏలోనూ జాతీయగీతం ఆలపిస్తారు’ అని నెస్‌వాడియా గుర్తు చేశాడు. 

విదేశాల్లో మంచిదే కదా..

ఐపీఎల్‌ జట్ల మధ్య విదేశాల్లోనూ ఐపీఎల్‌ నిర్వహించాలనే ఆలోచన సరైందన్నాడు నెస్‌వాడియా. ‘‘ఐపీఎల్‌ భారతదేశ లీగ్‌ అయినా విదేశాలకు విస్తరిస్తే ఇంకా బాగుంటుంది. ఇది క్రికెట్‌కు, బీసీసీఐకీ ప్రయోజనకరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫుట్‌బాల్‌ లీగ్‌లను పరిశీలిస్తే ప్రతి సీజన్‌కు ముందు వారు విదేశాల్లో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడతారు. దీనివల్ల మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఐపీఎల్‌ విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి విదేశాల్లో మ్యాచ్‌ల విషయంలో ఇతర క్రీడాలీగ్‌లను అనుసరించడం మంచి ఆలోచన. తాజాగా ఎన్‌బీఏ సైతం భారత్‌, చైనా విస్తరించిన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న సమస్యల్లా ప్రణాళికలను పక్కాగా రూపొందించడం, ఆటగాళ్లను అందుబాటులో ఉంచుకోవడం. అక్కడే బీసీసీఐ పాత్ర అవసరం’’ అని నెస్‌వాడియా చెప్పాడు. 

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

   13 hours ago

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

   19 hours ago

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

   25-05-2020

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

   24-05-2020

వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

   23-05-2020

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

   20-05-2020

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

   18-05-2020

సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

   18-05-2020

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

   18-05-2020

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

   17-05-2020

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle