ఐపీఎల్‌పై కరోనా నీడలు...మాస్క్‌తో చాహల్
11-03-202011-03-2020 13:12:04 IST
Updated On 11-03-2020 14:48:13 ISTUpdated On 11-03-20202020-03-11T07:42:04.461Z11-03-2020 2020-03-11T07:41:56.306Z - 2020-03-11T09:18:13.106Z - 11-03-2020

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వైరస్ తో వణికిపోతోంది. కరోనా ప్రభావం క్రీడలపై కూడా పడింది. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్ వుంటుందా లేదా అనేది ఇంకా తేలలేదు. కానీ క్రీడాకారులు మాత్రం కరోనా భయంతో వాయిదా పడుతుందేమో అంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ముఖానికి మాస్క్ తొడిగిన ఫోటో ఒకటి తన ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ఫోటో సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాహల్ ముఖానికి మాస్క్ వేసుకోవడంతో అతనికి వైరస్ ఏమైనా సోకిందా అని అభిమానులు కంగారు పడిపోయారు. అయితే అదేం లేదంటూ చాహల్ అసలు విషయం చెప్పేశాడు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాను మాస్క్ వాడుతున్నానని చెప్పేశాడు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎలాంటి వైరస్లు అయినా మన దగ్గరకు రాలేవని చహల్ ట్విటర్లో అభిప్రాయపడ్డాడు. కరోనా ప్రభావం తగ్గేవరకు ఇతరులతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేయాలని సూచించాడు. దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లు మొదటి వన్డే జరిగే ధర్మశాలకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. కాగా చహల్ ఒకరోజు ఆలస్యంగా జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ధర్మశాలకు వెళ్లే సమయంలో న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ముఖానికి మాస్క్ వేసుకొని ఇలా దర్శనమిచ్చాడు.కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్ల పట్ల తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ అన్నారు. అంతేగాక మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంకు వచ్చే ప్రేక్షకులతోనూ ఎలాంటి కరచాలనం చేయకుడదని జట్టును ఆదేశించినట్టు బౌచర్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్ళు బయటకు వెళ్లవద్దని అధికారులు వారికి ఆదేశాలిచ్చారు. కరోనా కారణంగా విదేశాలకు వెళ్ళేందుకు కూడా ఆటగాళ్ళు భయపడిపోతున్నారు.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
4 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
6 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
12 hours ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా