newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

29-05-202029-05-2020 09:55:10 IST
Updated On 29-05-2020 09:59:53 ISTUpdated On 29-05-20202020-05-29T04:25:10.395Z29-05-2020 2020-05-29T04:25:07.505Z - 2020-05-29T04:29:53.973Z - 29-05-2020

ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన అంశం మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌. అయితే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ధోనికి ఎప్పుడు రిటైర్‌ కావాలో ఒకరు చెప్పాల్సిన పని లేదని భారత మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఆటకు తాను అనుకున్నప్పుడే రిటైర్మెంట్‌ ఇచ్చే హక్కు ధోనికి ఉంది. అతను సాధించిన ఘనతలతో ఆ స్థాయికి చేరుకున్నాడు  రిటైరయ్యే సమయం వచ్చిందంటూ అతనికి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అతనో అద్భుతమైన క్రికెటర్‌. ధోని మేధస్సు, శాంతం, శక్తి, అథ్లెటిక్స్‌ నైపుణ్యం, వేగం అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఆధునిక యుగపు దిగ్గజ క్రీడాకారుల్లో ధోని ఒకరు. అతనికి నచ్చినప్పుడే రిటైర్‌ అవుతాడు’ అని కిర్‌స్టెన్‌ ధోనికి కితాబిచ్చాడు.

ధోనీ, కిర్‌స్టన్ ఇరువురూ భారత క్రికెట్ జట్టును ఎంతగా ప్రభావితం చేశారంటే వీరి నాయకత్వంలోనే టీమిండియా ఐసీసీ ప్రపంచకప్‌ని 2011లో సగర్వంగా కైవసం చేసుకుంది. అందుకే ధోనీని కిర్‌స్టన్ అంతగా గౌరవించి వ్యాఖ్యానించాడు. అసలు ఆట ఆడటమే ఒక సవాల్. భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఉండటాన్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. టీమిండియా కోచ్‌గా పనిచేసిన రోజులు నా జీవితంలోనే అత్యంత గౌరవప్రదమైనవి అంటూ కిర్‌స్టన్ పేర్కొన్నాడు.

ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ఆగ్రహ ట్వీట్‌.. డిలీట్‌

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పై చర్చ మరోసారి పతాక స్థాయికి చేరుకుంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019 అనంతరం ధోని ఇప్పటివరకు టీమిండియా జెర్సీ ధరించలేదు. దీంతో అప్పటినుంచి ఈ జార్ఖండ్‌ డైనమెట్‌ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. 

కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే బుధవారం ధోని రిటైర్మెంట్‌ తీసుకున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. అంతేకాకుండా #dhoniretire అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అయింది. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు. 

అయితే ఈ వార్తలను ధోని సతీమణి సాక్షి సింగ్‌ రావత్‌తో పాటు అతడి సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి చేసిన ట్వీట్‌ వివాదస్పదమైంది. ‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల మానసిక స్థితి దెబ్బతిన్నది అని నాకు అర్ధమవుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. 

దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది. గతంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి కూల్‌గానే సమాధానమిచ్చారని, తరుచూ ఇలాంటి వార్తలు వస్తుండటంతో పూర్తిగా సహనం కోల్పోయి కోపంలో అలా ట్వీట్‌ చేశారని ధోని కుటుంబ సన్నిహితులు పేర్కొంటున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle