newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎనిమిదిసార్లు డకౌట్ అయినా నువ్వే ఓపెనర్ అన్నాడు.. కుంబ్లేపై గంభీర్ ప్రశంసలు

04-05-202004-05-2020 12:54:03 IST
Updated On 04-05-2020 13:10:51 ISTUpdated On 04-05-20202020-05-04T07:24:03.381Z04-05-2020 2020-05-04T07:24:00.830Z - 2020-05-04T07:40:51.435Z - 04-05-2020

ఎనిమిదిసార్లు డకౌట్ అయినా నువ్వే ఓపెనర్ అన్నాడు.. కుంబ్లేపై గంభీర్ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జట్టులో ఆటగాళ్ల స్థానంపై పూర్తి భరోసా కల్పించిన సారధి ఎవరైనా ఉన్నారంటే భారత క్రికెట్లో అనిల్ కుంబ్లేకే ఆ ఘనత దక్కుతుందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కొనియాడాడు.  నేను ఎవరికైనా ప్రాణాన్ని ఇవ్వాల్సి వస్తే.. అనిల్ కుంబ్లేకే ఇస్తా. జట్టుపై, నాపై అంతటి ప్రభావం కలిగించిన కెప్టెన్ మరొకరు లేరు. అందుకే భారత టెస్టు ఆల్ టైమ్ ఎలెవన్ జట్టు కెప్టెన్ కుంబ్లేనే తప్ప మరొకరు కాదని గంభీర్ తేల్చిచెప్పాడు. భారత క్రికెట్‌కు దొరికిన అరుదైన ఆటగాడు కుంబ్లే అని కూడా గంభీర్ చెప్పాడు. కెప్టెన్​ మద్దతు లేకపోతే సెలెక్షన్ ఉన్నా జట్టు సభ్యులకు నిరుపయోగమే అని గంభీర్ చెప్పాడు.

టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లేపై మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తనకు కుంబ్లే ఎంతో ఇష్టమన్న గంభీర్‌.. అతని కోసం జీవితాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమేనన్నాడు. గతంలో కుంబ్లే కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గంభీర్‌ గుర్తు చేసుకున్నాడు. భారత క్రికెట్‌కు దొరికిన అరుదైన ఆటగాడు కుంబ్లే అని చెప్పుకొచ్చాడు. కుంబ్లే ఆడే సమయంలో అంపైర్ల నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్‌) ఉండి ఉంటే తన టెస్టు కెరీర్‌లో 900 వికెట్ల మైలురాయిని సునాయాసంగా చేరుకునేవాడన్నాడు. తన స్థానంపై భరోసా కల్పించిన సారథి ఎవరైనా ఉన్నారంటే అది అనిల్‌ భాయ్‌ అని గంభీర్‌ తెలిపాడు. భారత టెస్టు ఆల్‌టైమ్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించిన గంభీర్‌.. కెప్టెన్‌గా కుంబ్లేను ఎంచుకున్నాడు. 

ఎలెవన్‌ జట్టులో సునీల్‌ గావస్కర్‌కు స్థానం కల్పించిన గంభీర్‌.. కెప్టెన్‌గా మాత్రం కుంబ్లేను ఎంపిక చేశాడు.  2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు కుంబ్లేతో​ తనకు ఎదురైన అనుభవాలను గంభీర్‌ నెమరువేసుకున్నాడు. ‘నేను, సెహ్వాగ్ కలిసి భోజనం చేస్తుంటే కుంబ్లే మా దగ్గరికి వచ్చాడు. ఏం జరిగినా ఈ సిరీస్​లోని మొత్తం నాలుగు టెస్టుల్లో మీరిద్దరే ఓపెనింగ్ చేస్తారు. ఏమైనా సరే. ఒకవేళ మీరు ఎనిమిదిసార్లు డకౌట్ అయినా పర్లేదన్నాడు. నా కెరీర్​లో ఎవరి నుంచి నేను అలాంటి మాటలు వినలేదు. నేను ఎవరికైనా ప్రాణాన్ని ఇవ్వాల్సి వస్తే.. అనిల్ కుంబ్లేకే ఇస్తా. ఆ రోజు కుంబ్లే అన్న మాటలు ఇప్పటికీ నా మనసులో ఇంకా ఉన్నాయి. అప్పట్లో డీఆర్‌ఎస్‌ ఉంటే కుంబ్లే 900 టెస్టు వికెట్లను సాధించేవాడు’ అని గంభీర్‌ తెలిపాడు. 

ఇక సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి తరహాలో కుంబ్లే ఎక్కువ కాలం టీమిండియా కెప్టెన్‌గా చేసి ఉంటే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకునేవాడని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. 

I can give my life for Anil Kumble said gautam gambhir

గంభీర్‌ ప్రకటించిన టీమిండియా ఆల్‌టైమ్‌ టెస్టు జట్టు..

అనిల్ కుంబ్లే(కెప్టెన్​), సునీల్ గావస్కర్​, వీరేంద్ర సెహ్వాగ్​, రాహుల్ ద్రవిడ్​, సచిన్ టెండూల్కర్​, విరాట్ కోహ్లి, కపిల్​దేవ్​, ఎంఎస్ ధోని, హర్భజన్‌ సింగ్​,  జహీర్ ఖాన్​, జవగళ్ శ్రీనాథ్

రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ఈ స్థాయిలో ఉన్నాడంటే అదంతా ఎంఎస్‌ ధోని చలవే

అలాగే.. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ఈ స్థాయిలో ఉన్నాడంటే అదంతా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని చలవేనని పేర్కొన్నాడు. 2007లో అరంగేట్రం చేసిన మొదటి రోజుల్లో రోహిత్‌ శర్మ చాలా మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అప్పుడు జట్టు కెప్టెన్‌గా ధోని చాలాకాలం పాటు మద్దతుగా నిలిచాడని స్టార్‌స్పోర్ట్ష్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. 

గంభీర్‌ మాట్లాడుతూ.. ' రోహిత్‌ అంతర్జాతీయ కెరీర్‌ను 2007లో ప్రారంభించినా అతని కెరీర్‌ ఊపందుకున్నది మాత్రం 2013 నుంచే... ఎందుకంటే జట్టులోకి వచ్చిన మొదట్లో రోహిత్‌ చాలా మ్యాచ్‌ల్లో విఫలమైనా అ‍ప్పటి కెప్టెన్‌ ధోని చాలా మద్దతునిచ్చాడు. రోహిత్​ను ఓపెనర్​గా పంపాలని మహీ 2013లో  నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏకంగా వన్డేల్లో మూడు ద్విశతకాలను సాధించి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. 

సెలెక్షన్ కమిటీ, జట్టు మేనేజ్​మెంట్​ గురించి మాట్లాడొచ్చు.. కానీ కెప్టెన్​ మద్దతు లేకపోతే అవన్నీ నిరుపయోగమే. అంతా కెప్టెన్ చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం రోహిత్​ శర్మకు ధోనీ చాలా కాలం మద్దతుగా నిలిచాడు. నాకు తెలిసి అంత సపోర్ట్ మరే ఆడగాడు పొందలేదని నేను అనుకుంటున్నా' అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత యువ ఆటగాళ్లకు కెప్టెన్ విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉందని గౌతమ్ గంభీర్ చెప్పాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle