ఎంఎస్ ధోనీ బయోగ్రఫీ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య
14-06-202014-06-2020 19:40:40 IST
Updated On 14-06-2020 20:05:35 ISTUpdated On 14-06-20202020-06-14T14:10:40.100Z14-06-2020 2020-06-14T14:09:46.151Z - 2020-06-14T14:35:35.440Z - 14-06-2020

ఎంఎస్ ధోనీ ఆత్మకథ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో కలకలం రేగింది. సుశాంత్ ఎందుకు ఉరివేసుకున్నాడో కారణాలు తెలియరాలేదు. కాగా గత ఆరు నెలలుగా సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘దిల్ బేచారా’. ‘కోయ్ పో చి’తో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్ ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టీవ్ బొమ్‌కేష్ బక్షి’, ‘ఎం.ఎస్.ధోనిః ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్కమ్ న్యూయార్క్’, ‘కేదార్నాథ్’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్’, ‘డ్రైవ్’ తదితర చిత్రాల్లోసుశాంత్ వయసు 34 ఏళ్ళే.

సుశాంత్ మరణవార్త విని ఆయన మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే షాక్‌కు గురయ్యారు. ఓ మీడియా సంస్థ అంకితకు ఫోన్ చేసే చెప్పేంతవరకు సుశాంత్ మరణ వార్త ఆమెకు తెలియదట. మీడియా ప్రతినిధి ఫోన్ చేసి విషయం చెప్పగానే.. ఏంటి అని షాకయ్యారు. ఆ తర్వాత ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.సుశాంత్ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్, టాలీవుడ్ చెందిన పలువురు ట్వీట్ చేశారు.
సుశాంత్ సింగ్ దగ్గర మేనేజర్‌గా పని చేసిన దిశ సలియా కొద్దిరోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. . ముంబైలో తన భవనంలోని 14వ అంతస్థు పైనుంచి దూకింది. తీవ్ర రక్తస్రావమైన ఆమెను వెంటనే బొరివలిలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందింది. తాజాగా సుశాంత్ ఆత్మహత్య మిస్టరీగా మారింది.
నటుడు రాజశేఖర్, అల్లు అర్జున్ , క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్ సుశాంత్ ఆత్మహత్య వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యామని, అతని మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు
లోకేష్ దిగ్భ్రాంతి
యువ హీరో సుశాంత్ సింగ్ మరణ వార్త విని షాక్ కు గురయ్యాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బాలీవుడ్ ఓ యువ నటుడిని కోల్పోయిందని .. సుశాంత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
12 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
13 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
20 hours ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా