ఉమ్మితో బాల్ రుద్దిన ఫీల్డర్.. శానిటైజ్ చేసి ఇచ్చిన అంపైర్
20-07-202020-07-2020 14:18:55 IST
Updated On 20-07-2020 13:47:04 ISTUpdated On 20-07-20202020-07-20T08:48:55.169Z20-07-2020 2020-07-20T08:13:56.874Z - 2020-07-20T08:17:04.597Z - 20-07-2020

బౌలర్ చేతికి బంతిని అందించే ముందు ఫీల్డర్ దానిపై ఉమ్ము లేదా చెమటని రుద్ది మెరుపుని తెప్పించడం గత దశాబ్దాలుగా కొనసాగుతోంది. ముఖ్యంగా.. టెస్టు మ్యాచ్ సమయంలో బంతి నుంచి స్వింగ్‌ని రాబట్టేందుకు ఫీల్డింగ్ టీమ్ తరచూ బంతిపై ఉమ్ము రుద్ది శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
కరోనా వైరస్ నేపథ్యంలో.. బంతిపై ఉమ్ము లేదా చెమటని రుద్దడాన్ని ఐసీసీ క్రికెట్ కమిటీ ఇటీవల నిషేధించింది. రెండు సార్లు ఈ తప్పిదానికి ఫీల్డింగ్ టీమ్ పాల్పడితే.. 5 పరుగుల పెనాల్టీని కూడా విధిస్తామని హెచ్చరించింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఫీల్డర్ డొమినిక్ సిబ్లే.. అలవాటులో పొరపాటుగా బంతిపై ఉమ్ము రుద్దేశాడు.
ఇన్నింగ్స్ 42వ ఓవర్ వేసేందుకు ఆఫ్ స్పిన్నర్ డొమ్ బెస్ బౌలింగ్‌కిరాగా.. అతనికి బంతిని అందించే క్రమంలో డొమినిక్ సిబ్లే పొరపాటున బంతికి ఉమ్ము రాసేశాడు. దాంతో.. వెంటనే తన తప్పిదాన్ని గ్రహించిన సిబ్లే.. అంపైర్ల దృష్టికి తీసుకెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ మైకేల్ గోఫ్ తన వద్ద ఉన్న టిస్యూతో బంతిని శానిటైజ్ చేశాడు. అనంతరం మ్యాచ్ మళ్లీ కొనసాగించారు.

మూడు టెస్టుల ఈ సిరీస్‌ని పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తున్న ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి నెగటివ్ వస్తేనే ఆటలోకి అనుమతిస్తోంది.
గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. మొదటి ఇన్నింగ్స్‌ని 469/9తో డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. ఆదివారం 287 పరుగులకి ఆలౌటవగా.. ఇంగ్లాండ్‌కి 182 పరుగుల ఆధిక్యం లభించింది. మ్యాచ్ ఇవాళే ఆఖరికాగా.. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 37/2తో నిలిచింది. మొత్తంగా.. ఇంగ్లాండ్ జట్టు 219 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

RCBvsRR: బెంగళూరు వరుస విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వెయ్యగలదా?
4 hours ago

చెన్నై సూపర్ కింగ్స్ ను టెన్షన్ పెట్టగా.. చివరికి..!
12 hours ago

CSK vs KKR: ధోని కెప్టెన్సీ ముందు KKR నిలిచేనా?
21-04-2021

SRH లక్ష్యం 120 ఛేదించేనా తడబడేనా?
21-04-2021

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..
21-04-2021

ధోని తల్లిదండ్రులకు కరోనా..!
21-04-2021

రోహిత్ శర్మకు భారీ జరిమానా..!
21-04-2021

DC vs MI: ముంబై బౌలింగ్ ధాటికి.. ఢిల్లీ బ్యాటమెన్ నిలవగలరా..!
20-04-2021

రాజస్థాన్ ను చిత్తు చేసిన చెన్నై
20-04-2021

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
19-04-2021
ఇంకా