ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమే మంజ్రేకర్ తప్పా.. పండిట్ సమర్థన
20-03-202020-03-2020 08:28:43 IST
2020-03-20T02:58:43.828Z20-03-2020 2020-03-20T02:58:04.790Z - - 11-04-2021

బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ సభ్యుడు సంజయ్ మంజ్రేకర్‌ది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్ప అతడికి వేరే ఉద్దేశాలు ఉండవని మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ వెనుకేసుకొచ్చాడు. కావాలంటే వ్యాఖ్యానాల్లో దూకుడు కాస్త తగ్గించమని బీసీసీఐ హెచ్చరించి మళ్లీ అతడిని విధుల్లోకి తీసుకోవాలని, అంతేకాని తన కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయడం న్యాయం కాదని పండిట్ సమర్థించాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కామెంటరీ ప్యానల్ నుంచి ఉద్వాసనకు గురైన సంజయ్ మంజ్రేకర్‌కు మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్.. ఎవర్నీ కావాలని గాయపరచడంటూ వెనుకేసుకొచ్చాడు. తనకు మంజ్రేకర్ చిన్నతనం నుంచి తెలుసని, అతనిది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్పితే వేరే ఉద్దేశాలు ఏమీ ఉండన్నాడు. ఒక కామెంటరీ చెప్పేటప్పుడు ప్రతీసారి ప్రజల్ని ఆకట్టుకునే వ్యాఖ్యానాలు అతను చేయలేకపోవచ్చని, అందుచేత మంజ్రేకర్‌ను తన కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయడం భావ్యం కాదన్నాడు. మంజ్రేకర్‌ను కాస్త దూకుడు తగ్గించమని బీసీసీఐ ఒక వార్నింగ్ ఇచ్చి, మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకోవాలన్ని చంద్రకాంత్ పండిట్ కోరాడు. ‘నాకు మంజ్రేకర్ బాల్యం నుంచి తెలుసు. ఇతరుల్ని గాయపరిచే మనస్తత్వం అతనిదైతే కాదు. ఉన్నది ఉన్నట్లు వ్యక్తిత్వం మంజ్రేకర్‌ది. ఆ విషయంలో నేను ఎప్పుడు అతన్ని అభిమానిస్తూనే ఉంటాను. ముఖం మీద మాట్లాడే స్వభావం ఉన్నవారిని ఎవరూ ఇష్టపడరు.. కానీ ఒక కామెంటేటర్‌గా అతను అందర్నీ అన్ని వేళలా సంతృప్తి పరచలేడు. అతను చేసే జాబ్‌లో అది కుదరకపోవచ్చు. సంజయ్ ఎవరికీ వ్యతిరేకం కాదు. సంజయ్‌ను కామెంటేటర్‌గా తీసినందుకు నేను ఎవర్నీ నిందించడం లేదు. కేవలం నేను బీసీసీఐకి రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా. మంజ్రేకర్‌ను తిరిగి కామెంటరీ ప్యానల్లోకి తీసుకోండి. ఒకసారి బీసీసీఐ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా.. మొత్తం కామెంటరీ ప్యానల్లో ఉన్న అందరి ఇన్పుట్స్ తెప్పించుకోండి. అదే సమయంలో కోచ్‌లుగా చేసిన వారు మాట్లాడిన సందర్భాలను కూడా ఒకసారి పరిశీలించండి. ఒక బ్యాట్స్‌మన్ చెత్త షాట్ ఆడినప్పుడు కచ్చితత్వంతో మాట్లాడిన వారిని చాలామంది ప్రజలు అభిమానిస్తారు కదా.. అటువంటప్పుడు సంజయ్ చేసిన దాంట్లో తప్పేముంది’ అని చంద్రకాంత్ పండిట్ ప్రశ్నించాడు. ఇంగ్లండులో వన్డే ప్రపంచ కప్ సందర్భంగా 2019లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి చేసిన మొరటు వ్యాఖ్యకుగాను బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. అలాగే తోటి వ్యాఖ్యాత అయిన హర్షా భోగ్లేపై కూడా నేరుగా విమర్శలు చేయడం, టీమిండియా కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ వంటి వారిపై కూడా దూకుడుగా విమర్శలు చేయడం బీసీసీఐకి ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో గత నెలలో సంజయ్ మంజ్రేకర్‌ను తన కామెంటేటర్ల ప్యానల్ జాబితానుంచి బీసీసీఐ తొలగించింది.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
15 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
16 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
a day ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా