ఈ తరం క్రికెటర్లు సీనియర్లను లెక్కచేయరు.. యువీ సంచలన ప్రకటన
03-04-202003-04-2020 14:02:01 IST
Updated On 03-04-2020 14:07:00 ISTUpdated On 03-04-20202020-04-03T08:32:01.043Z03-04-2020 2020-04-03T08:31:58.545Z - 2020-04-03T08:37:00.020Z - 03-04-2020

కొత్తగా క్రికెట్ ఫీల్డ్‌కు వచ్చినప్పుడు టీమిండియా సీనియర్ ఆటగాళ్లతో తిట్లు తిన్నానని కానీ ఇప్పుడు ఐపీఎల్ తెచ్చిపెడుతున్న డబ్బు మహత్మ్యం కాబోలు దేశంలో సీనియర్ క్రికెటర్లను ఏమాత్రం లెక్కిచేయని కొత్తతరం క్రికెటర్లు పుట్టుకొచ్చారని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన ప్రకటన చేశాడు. ఐపీఎల్ లేని రోజుల్లో ఆరంగేట్రం చేసిన తాను తన ఆరాధ్య హీరోలతో కలిసి ఆడే అవకాశం వచ్చినప్పుడు వారంటే ఎంతో గౌరవం చూపేవాడినని, ఎలా ప్రవర్తించాలో కూడా వారినుంచి నేర్చుకున్నానని యువీ ఉద్వేగంతో చెప్పాడు. ఐపీఎల్ వచ్చిన తర్వాత కుర్రాళ్లకు చాలా డబ్బు వచ్చిపడుతోందని, దాంతో వారు తమ సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ఐపీఎల్ లేని రోజుల్లో నేను అరంగేట్రం చేశాను. నేను టీవీలో ఆరాధించే హీరోలతో కలిసి ఆడే అవకాశం వచ్చినప్పుడు వారంటే ఎంతో గౌరవం చూపించాను. ఎలా ప్రవర్తించాలో, మీడియాతో ఎలా మాట్లాడాలో వారు నేర్పించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కొందరు ఈతరం కుర్రాళ్లతో మాట్లాడుతుంటే వారు సీనియర్లను ఏమాత్రం లెక్క చేయరని అర్థమైంది. నేను ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్, కుంబ్లేలాంటి వారితో తిట్లు కూడా తిన్నాను. కానీ వారి ద్వారా ఎంతో నేర్చుకున్నాను కూడా’ అని యువీ విశ్లేషించాడు. భారత క్రికెట్ కెప్టెన్లలో ధోనీతో పోల్చినా సరే సౌరవ్ గంగూలీ అందరికంటే ఎక్కువగా తనకు మద్దతుగా నిలిచాడని యువీ పేర్కొన్నాడు. ధోనితో పోలిస్తే దాదా నాయకుడిగా ఉన్న సమయంలోనే తన కెరీర్ బాగా సాగిందని యువీ గుర్తు చేసుకున్నాడు. భారత్ తరఫున యువీ 304 వన్డేలు ఆడగా ఇందులో గంగూలీ సారథ్యంలో 110 మ్యాచ్‌లు, ధోని కెప్టెన్సీలో 104 మ్యాచ్‌లు ఆడాడు. ‘సౌరవ్ కెప్టెన్సీలో నేను ముందుగా ఆడాను. ఆ సమయంలో అతను నాకు చాలా అండగా నిలిచాడు. ఆ తర్వాత ధోని కెప్టెనయ్యాడు. ఇద్దరిలో ఎవరు అత్యుత్తమమో చెప్పడం కొంత కష్టమే అయినా... సౌరవ్ మద్దతుగా నిలిచిన సమయంలోనే నా కెరీర్ మధురానుభూతులు ఉన్నాయి. ధోని నుంచి గానీ ఆ తర్వాత కోహ్లి నుంచి గానీ నాకు ఆ తరహా మద్దతు ఎప్పుడూ లభించలేదు’ అని యువీ వ్యాఖ్యానించాడు. తన కెరీర్లో ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బంది పడ్డానని, అయితే ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ సలహాతో స్వీప్ చేయడం మొదలు పెట్టాక పరిస్థితి మెరుగైందని యువరాజ్ అన్నాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో కూడా ఆడలేకపోయేవాడినని, అయితే టెస్టు జట్టులో రెగ్యులర్ కాకపోవడం వల్ల మెక్‌గ్రాత్‌ను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం రాలేదని అతను అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తాను ధరించిన ‘12’ నంబర్ జెర్సీకి బీసీసీఐ రిటైర్మెంట్ ఇవ్వాలని, మరెవరూ దానిని వాడరాదంటూ కొందరు అభిమానులు కోరడం తనకు ‘అతి’గా అనిపించిందని యువరాజ్ అన్నాడు. టెస్టుల్లో ‘12’ నంబర్‌ను ఇప్పుడు పృథ్వీ షా ధరిస్తున్నాడు. ‘జెర్సీ సంఖ్య అనేది సమస్యే కాదు. పృథ్వీలాంటి ప్రతిభావంతుడు దానిని ధరించడం సంతోషకరమే. అతనిలో ఎంతో సత్తా ఉంది. పృథ్వీ ఎప్పుడు బరిలోకి దిగినా మనం అండగా నిలవాలి’ అని యువీ స్పష్టం చేశాడు. భారత క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి 9 నెలల క్రితం తప్పుకుని రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్ తన క్రికెట్ జీవితంలోని ఎత్తుపల్లాలను నిర్బయంగా చెబుతూ వస్తుండటం విశేషం. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లలో మ్యాచ్ విన్నర్‌గా విశేషమైన ప్రతిభ ప్రదర్శించిన యువీ దూకుడు బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచాడు. ఇంగ్లండ్ కౌంటీ మ్యాచ్‌లో ఆనాటి ఇంగ్లండ్ యువ బౌలర్ వేసిన ఓవర్లో ఆరుబంతులకు ఆరు సిక్స్‌లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించిన యువరాజ్ సింగ్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపేవాడు.

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
an hour ago

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
2 hours ago

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
5 hours ago

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
9 hours ago

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
a day ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
14-04-2021

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
14-04-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021
ఇంకా