newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ ఒక్క ఏడాదికే డ్రీమ్ 11.. స్పష్టం చేసిన బీసీసీఐ

20-08-202020-08-2020 12:14:50 IST
Updated On 20-08-2020 12:27:21 ISTUpdated On 20-08-20202020-08-20T06:44:50.886Z20-08-2020 2020-08-20T06:44:28.677Z - 2020-08-20T06:57:21.449Z - 20-08-2020

ఈ ఒక్క ఏడాదికే డ్రీమ్ 11..  స్పష్టం చేసిన బీసీసీఐ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌గా ఫాంటసీ గేమింగ్‌ ఫ్లాట్‌ఫాం 'డ్రీమ్‌ 11'తో ఒప్పందం ఈ ఏడాదికి మాత్రమే ఉంటుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా బుధవారం ప్రకటించింది.

2021, 2022 సీజన్లకు కూడా స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం చెరో రూ.240 కోట్లను చెల్లిస్తామన్న ఆ సంస్థ ప్రతిపాదనను బోర్డు తిరస్కరించింది. మూడేళ్ల షరతు ఉన్నప్పటికీ.. తక్కువ మొత్తం చెల్లిస్తుండటమే ఇందుకు కారణమని తెలిసింది.ఐపీఎల్‌ 2020 టైటిల్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11ను ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటించింది. డ్రీమ్‌ 11 (స్పోర్టా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) భారతీయ కంపెనీ. ప్రధాన కేంద్రం ముంబైలో ఉంది అని బీసీసీఐ ఓ ప్రకటన జారీ చేసింది. 

ఈ ఏడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం రూ.222కోట్లకు బిడ్‌ వేసి హక్కులను దక్కించుకున్న డ్రీమ్‌ 11 తదుపరి రెండేండ్లకు కూడా తమకే ఇవ్వాలని ప్రతిపాదించిందని సమాచారం. దీన్ని బీసీసీఐ తిరస్కరించిందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

ఐపీఎల్ 2020 కోసం డ్రీమ్‌ 11 అత్యధిక మొత్తానికి బిడ్‌ వేసింది. కానీ వచ్చే రెండేళ్లలో రూ.240 కోట్లకే టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ను ఇచ్చేందుకు అంగీకరించం. వచ్చే ఏడాదికల్లా కరోనా పరిస్థితులు అప్పటికల్లా కుదురుకుంటాయి. వివోతో ఒప్పందం ఉంకా ఉంది. ప్రస్తుతం నిలిచిపోయింది. ఒకవేళ రూ.440 కోట్లు వస్తుంటే.. రూ.240కోట్లకే ఎందుకు ఇవ్వాలి అని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు.

సరిహద్దు వివాదం కారణంగా చైనా వస్తు బహిష్కరణ ఉద్యమం బలంగా ఉండటంతో.. ఈ ఏడాది టైటిల్‌ స్పాన్సర్‌గా ఉండలేమని వివో మొబైల్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి రూ.444 కోట్లు నష్టపోయాయి. దానిని పూడ్చుకొనేందుకు బిడ్డింగులు ఆహ్వానించగా.. బైజుస్‌ (రూ.201 కోట్లు), అన్‌అకాడమీ (రూ.170 కోట్లు), డ్రీమ్‌ 11 (రూ.222 కోట్లు) పోటీపడ్డాయి. 

చివరికి అత్యధిక మొత్తం వేసిన డ్రీమ్‌ 11కే టైటిల్‌ స్పాన్సర్ హక్కులు దక్కాయి. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు యూఏఈలో ఐపీఎల్‌ జరుగుతుంది.ఒక వైపు చైనా కంపెనీలతో సంబంధాలు తెంచుకోవాలంటూ, మరో వైపు డ్రీమ్‌ 11తో బీసీసీఐ ఒప్పందం చేసుకోవడాన్ని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్‌ (సీఏఐటీ) ప్రశ్నించింది. 

చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీకే ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు ఇవ్వడం తమను బాధించిందని అభిప్రాయపడింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి సీఏఐటీ లేఖ రాసింది. డ్రీమ్‌ 11లో చైనాకు చెందిన టెన్సెంట్‌ కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే భారత అభిమానుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఇలా దొడ్డి దారిన హక్కులు కేటాయించడం సరైంది కాదు. ఇది భారత ప్రయోజనాలను పణంగా పెట్టడమే అని సీఏఐటీ లేఖలో పేర్కొంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle