newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇవాళ తొలివన్డే.. ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

05-02-202005-02-2020 08:58:19 IST
2020-02-05T03:28:19.591Z05-02-2020 2020-02-05T03:28:12.515Z - - 11-04-2021

ఇవాళ తొలివన్డే.. ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కివీస్ గడ్డపై ఆదివారం ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌ ని క్లీన్‌ స్వీప్ చేసి దూకుడు మీద ఉంది. టీమిండియా వన్డేలలోనూ అదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా హామిల్టన్ వేదికగా ప్రారంభం అవుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. న్యూజీల్యాండ్ ఏమో కనీసం వన్డే సిరీస్‌లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమవగా టామ్ లాథమ్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక భారత్ జట్టు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా గాయంతో ఈ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్ అగర్వాల్ బరిలోకి దించింది రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle