newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

ఇమాముల్‌ హాక్ పై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ దారుణమైన ట్వీట్..

02-12-201902-12-2019 07:51:33 IST
2019-12-02T02:21:33.986Z02-12-2019 2019-12-02T02:21:30.822Z - - 25-05-2020

ఇమాముల్‌ హాక్ పై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ దారుణమైన ట్వీట్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి దిశగా సాగుతోంది. 287 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ జట్టు ఇప్పటికే మూడు వికెట్లు నష్టపోయి 39 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ ఓపెనర్ ఇమాముల్ హాక్(0) జట్టు స్కోరు 2 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో కూడా ఇమాముల్ హాక్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇమాముల్ హాక్ ఆట తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి.

పాక్ దిగ్గజ ఆటగాడు ఇంజమాముల్ హాక్ మేనల్లుడైన ఇమాముల్ హాక్ ఇప్పటి వరకు 11 టెస్ట్ లు ఆడి కేవలం 485 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 28.4 ఏవరేజ్ తో ఒక్క సెంచరీ కూడా చేయని ఇమాముల్ హాక్ తన పేలవ ఆట తీరును ప్రదరిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు.

వన్డేలలో అద్భుతంగా రాణిస్తుండటంతో సెలెక్టర్లు అతనికి టెస్ట్ లలో కూడా పదే పదే అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ అవకాశాలను అతను ఉపయోగించుకోలేకపోతున్నాడు. తాజాగా ఆసీస్ తో జరుగుతున్న సిరీస్ లోఆసీస్ పేసర్లు తమ స్వింగ్ బౌలింగ్ తో హాక్ ను తక్కువ స్కోర్లకే ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్‌ క్రికెట్‌ హాక్ పై దారుణమైన ట్వీట్ చేసింది. 

"ఇమాముల్ హాక్ కెరీర్ లో చేసిన పరుగుల కన్నా ఈ సిరీస్ లో వార్నర్ చేసిన పరుగులు ఎక్కువ" అంటూ ఐస్‌లాండ్‌ క్రికెట్‌ చేసిన ట్వీట్ వైరల్ అయింది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో డేవిడ్ వార్నర్ (154. 335) పరుగులు చేశాడు. దీంతో ఈ సిరీస్ లో వార్నర్ 489 పరుగులు చేశాడు. ఇమాముల్ హాక్ 11 టెస్ట్ లలో 485 పరుగులు మాత్రమే చేశాడు. ఐస్‌లాండ్‌ క్రికెట్‌ చేసిన ట్వీట్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

దారుణమైన ట్వీట్ చేయడం ఐస్‌లాండ్‌ క్రికెట్‌ కు కొత్తేమి కాదు. తాజాగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లీగ్ దశలో ఇంగ్లాండ్ జట్టు, ఆఫ్గాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. మోర్గాన్ (148), బెయిర్ స్టో(90), రూట్(88) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 397 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరి దెబ్బకు ఆఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 9 ఓవర్లు మాత్రమే వేసి 110 పరుగులు సమర్పించుకున్నాడు.

No photo description available.

ఈ సందర్భంగా ఐస్‌లాండ్‌ క్రికెట్‌ " రషీద్ ఖాన్ 110 పరుగులతో సెంచరీ చేసిన ఆఫ్గాన్ తొలి ఆటగాడుగా నిలిచాడు. వెల్డన్ యంగ్ మాన్" అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ పై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు లూక్ రైట్, స్టువర్ట్ బ్రాడ్ ఐస్‌లాండ్‌ క్రికెట్‌ చేసిన ట్వీట్ ను తప్పుపట్టారు. 

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

   24-05-2020


వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

వికెట్ కీపర్‌కు మారుపేరు ఇప్పటికీ ధోనీనే.. పక్కనపెడితే తీవ్ర నష్టం.. కైఫ్ ప్రశంసల వర్షం

   23-05-2020


ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

ఐపీఎల్ పై ఆశలు.. బీసీసీఐ నిర్ణయం ఎలా వుంటుందో?

   20-05-2020


వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీకి అంపైర్ భయమే కారణం..డేల్ స్టెయిన్ ఆరోపణ

   18-05-2020


సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

సోషల్ మీడియాను ఊపేస్తున్న డేవిడ్ వార్నర్

   18-05-2020


కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

   18-05-2020


కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

   17-05-2020


భజ్జీ దొరికుంటే ఉతికేసేవాడిని.. తప్పించుకున్నాడు.. షోయబ్ సంచలన ప్రకటన

భజ్జీ దొరికుంటే ఉతికేసేవాడిని.. తప్పించుకున్నాడు.. షోయబ్ సంచలన ప్రకటన

   17-05-2020


భారత్ చేతిలోనే టెస్ట్ క్రికెట్ భవిష్యత్..ఛాపెల్ అంతరంగం

భారత్ చేతిలోనే టెస్ట్ క్రికెట్ భవిష్యత్..ఛాపెల్ అంతరంగం

   16-05-2020


నువ్వు చెబితేనే ధోనీ ఫినిషర్ అయ్యాడా చాపెల్.. హర్భజన్, యువీ ధ్వజం

నువ్వు చెబితేనే ధోనీ ఫినిషర్ అయ్యాడా చాపెల్.. హర్భజన్, యువీ ధ్వజం

   15-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle