newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇక సాగదీయకు ధోనీ.. గౌరవంగా రిటైర్ అయిపో.. షోయబ్ హితవు

13-04-202013-04-2020 14:27:22 IST
Updated On 13-04-2020 14:38:38 ISTUpdated On 13-04-20202020-04-13T08:57:22.690Z13-04-2020 2020-04-13T08:57:20.996Z - 2020-04-13T09:08:38.722Z - 13-04-2020

ఇక సాగదీయకు ధోనీ.. గౌరవంగా రిటైర్ అయిపో.. షోయబ్ హితవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అటు క్రికెట్ మైదానంలోకి రాకుండా, ఇటు రిటైర్మెంట్ విషయంలో ఏదీ తేల్చకుండా ఎన్నాల్లు సాగదీస్తావ్ ధోనీ.. ఆటకు ఇకనైనా గౌరవంతో వీడ్కోలు పలికితే మంచిది అంటూ పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్ ఉన్నట్లుంది బాంబు పేల్చాడు. భారత క్రికెటర్ల గురించి, భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ పోటీల గురించి అలుపన్నదే లేకుండా అభిప్రాయాలు చెబుతున్న పాక్ స్పీడ్ స్టర్ ఉన్నట్లుండి ధోనీపై పడ్డాడు. ఇటీవలే కరోనాపై పోరాటానికి నిధుల సమీకరణ కోసం భారత్​, పాక్ మధ్య మ్యాచ్​లు నిర్వహించాలని చెప్పిన  అక్తర్ పలువురి ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. 

తాజాగా టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు. ఈ అంశాన్ని ధోనీ ఎక్కువకాలం సాగదీయకుండా ఉంటే బాగుంటుందని అక్తర్ తెలిపాడు. 'ధోనీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి భారత క్రికెట్​కు సేవలు అందించాడు. ఇక ఆటకు గౌరవంతో వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసింది. అయితే ధోనీ ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు సాగదీస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాతే అతడు రిటైరవ్వాల్సింది. ఒకవేళ నేను అతడి స్థానంలో ఉంటే అప్పుడే ఆటకు వీడ్కోలు పలికేవాడిని. 2011 ప్రపంచకప్‌ తర్వాత ఇక ఆడకూడదరి నిర్ణయించుకొని నేను క్రికట్‌కు వీడ్కోలు పలికాను. ఆ తర్వాత ఎప్పుడు బ్యాట్‌ పట్టలేదు. కానీ ఇండియాకు రెండు ప్రపంచకప్​లు అందించడంలో కీలక పాత్ర పోషించిన ధోనికి వారి దేశం ఎంతో గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉంది.

ఒకవేళ ఐపీఎల్‌ 2020 జరిగి ఉంటే.. అందులో ధోని మంచి ప్రదర్శన కనబరిచి ఉంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండేవాడు. నా దృష్టిలో 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌తోనే ధోని ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. అయితే ప్రపంచకప్ తర్వాతనైనా.. వీడ్కోలు సిరీస్ ఆడి, గౌరవంగా తప్పుకోవాల్సింది అంటూ షోయబ్ తన వంతుగా ధోనీ నిష్క్రమణ తప్పదని చెప్పేశాడు.

కాగా, భారత్ మామూలు టోర్నీల్లో అదరగొడుతూ ప్రపంచ కప్ వంటి కీలక టోర్నీల్లో చతికిలపడుతుండటానికి కారణం మిడిలార్డర్‌లో ఫినిషర్స్ కొరత ప్రభావమేనని అక్తర్ తేల్చి చెప్పేశాడు. ఇక మాములు సిరీస్‌ల్లో అదరగొడుతున్న కోహ్లీ సేన.. ఐసీసీ టోర్నీ‌ల్లో విజేతగా నిలవకపోవడానికి మిడిలార్డ‌ర్‌లో మ్యాచ్ విన్నర్స్ లేకపోవడమే కారణం. టోర్నీ విజేతలుగా నిలవడం ఒక విషయమైతే.. అగ్ర జట్టుగా కొనసాగడం మరో విషయం. టెస్ట్‌ల్లో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. పరిమిత ఓవర్లలో కూడా టాప్ టీమ్స్‌లో ఒకటిగా ఉంది అని షోయబ్ చెప్పాడు.

కేవలం ఐసీసీ ఈవెంట్ల ఫలితాల ఆదారంగా వారి ప్రదర్శనపై ఓ అంచనాకు రాకుడదు. అదే సమయంలో ఐసీసీ ఈవెంట్స్ కూడా వారు గెలవాల్సిందే. టాప్-4 చెలరేగితో ఆ జట్టుకు తిరుగుండదు. కానీ ఎప్పుడో ఒకసారి విఫలమైతే మాత్రం ఫలితం వేరేలా ఉంటుంది. వారి సమస్యే అదే. అలాగే ధోనీ, యువరాజ్ సింగ్ వంటి ఫినిషర్స్ మిడిలార్డర్‌లో ఉంటే.. ఫలితం వేరేలా ఉంటుంది. సమస్యంతా మిడిలార్డర్‌లో ఫినిషర్స్ కొరత వల్లే ' అంటూ అక్తర్‌ చెప్పుకొచ్చాడు. 

ఇక ప్రస్తుత కరోనా బీభత్సం ఇలాగే కొనసాగితే మరో 6-8 నెలలు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఉండవన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ కూడా జరిగే అవకాశం లేదని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle