newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇండియా వర్సెస్ సెండప్ టీం మధ్య ఫేర్వెల్ మ్యాచ్

24-08-202024-08-2020 08:12:16 IST
2020-08-24T02:42:16.969Z24-08-2020 2020-08-24T02:41:35.946Z - - 19-04-2021

ఇండియా వర్సెస్ సెండప్ టీం మధ్య ఫేర్వెల్ మ్యాచ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతనికి సరైనా సెండాఫ్ దక్కలేదని చాలా మంది మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ పెదవి విరిచారు. భారత క్రికెట్‌లో ఇలా ఆటగాళ్లు సెండాఫ్ మ్యాచ్‌ ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించడం చాలా కామన్‌గా మారిపోయింది. ఎంతలా అంటే..? గత దశాబ్దకాలంగా ఓ 11 మంది క్రికెటర్లు ఇలా ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండానే తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి గుడ్ బై చెప్పేశారు.

ఈ ఏడాది ధోనీ, సురేశ్ రైనా ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించగా.. గత ఏడాది యువరాజ్ సింగ్, అంబటి రాయుడు (రిటైర్మెంట్ మళ్లీ వెనక్కి తీసుకున్నాడు) వీడ్కోలు చెప్పేశారు. అంతక ముందు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్.. ఇలా 11 మంది భారత క్రికెటర్లకి సెండాఫ్ దక్కలేదని తేల్చిన ఇర్ఫాన్ పఠాన్.. వారికి ఫేర్‌వెల్ మ్యాచ్‌ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు.

టీమిండియా vs సెండాఫ్ దక్కని క్రికెటర్ల మధ్య ఒక మ్యాచ్‌ని నిర్వహించి.. వారికి గౌరవంగా వీడ్కోలు చెప్పాలని ప్రతిపాదించిన ఇర్ఫాన్ పఠాన్.. ఒక టీమ్‌ని కూడా ప్రకటించాడు.ఇందులో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కి అవకాశం దక్కలేదు. 2013లో సచిన్ టెండూల్కర్‌ రిటైర్మెంట్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అప్పట్లో రూ. కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే.

ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించిన టీమ్ ఇదే: గౌత‌మ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, మహేంద్రసింగ్ ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, ప్రగ్యాన్ ఓజా లు ఉన్నారు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle