newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇండియాలో ఏం జరగట్లేదు.. ఐపీఎల్ సంగతి ఎందుకు?

13-04-202013-04-2020 11:38:39 IST
Updated On 13-04-2020 12:04:40 ISTUpdated On 13-04-20202020-04-13T06:08:39.001Z13-04-2020 2020-04-13T06:08:32.892Z - 2020-04-13T06:34:40.422Z - 13-04-2020

ఇండియాలో ఏం జరగట్లేదు.. ఐపీఎల్ సంగతి ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అన్ని వ్యాపారాలు, పరీక్షలు వాయిదా పడుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. ఇక సమ్మర్ వచ్చిందంటే సందడి చేసే ఐపీఎల్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఐపీఎల్ వుంటుందా లేదా అనేది త్వరలో స్పష్టత ఇస్తామని బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్‌ నిర్వహణపై మీడియాతో ఆయన మాట్లాడారు.

ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా క్రీడలు జరిగే అవకాశం ఎక్కడ ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహిం చడం కష్టమని దాదా పేర్కొన్నాడు. కోవిడ్‌ 19 మహమ్మారి తీవ్రమవుతున్న పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టులను మూసివేశారు. కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదే పరిస్థితి మే నెలవరకూ ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు విదేశాలు నుంచి ఎలా వస్తారు? అన్ని దేశాల విదేశీ పర్యటనలు, క్రీడాకారులు, టూరిస్టులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌ అనే కాదు ప్రపంచంలో ఏ క్రీడలు జరగడం లేదు. 

ప్రస్తుత స్థితిలో ఐపీఎల్‌పై ఏం చెప్పమంటారు. ఐపీఎల్‌ను పక్కన బెట్టండి. ప్రపంచం మొత్తమే స్తంభించిపోయింది. ఈ సమయంలో ఏ రకమైన క్రీడలూ జరగడంలేదన్నారు గంగూలీ. బీసీసీఐ అధికారులతో, ఫ్రాంచైజీ యాజమాన్యాలతో చర్చించాక  ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీపై స్పష్టత వస్తుందని గంగూలీ తెలిపారు. తన పదవీకాలంపై మాట్లాడే సందర్భం కాదన్న ఈ భారత మాజీ కెప్టెన్‌ పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఈ దుస్థితి ఇంకెప్పుడూ రాకూడదని ప్రార్థిస్తున్నాఅన్నారు. 

కరోనాను కట్టడి చేయాలంటే ఇంట్లోనే ఉండండి. రోడ్లపై తిరుగుతూ అధికారుల్ని ఇబ్బంది పెట్టొద్దు, వైద్యులపై భారం మోపవద్దు. అనుకోని పరిస్థితులెదురైనపుడు కూడా సానుకూలంగానే మెలగాలి. ఏం చేస్తే సంతోషం కలుగుతుందో అదే చేయాలి. ఇదే ముఖ్యం. ఇదే పాఠం. నేను నా కుటుంబంతో కలిసి హాయిగా ఇంట్లో ఉన్నాను. సాధారణంగా ఇలాంటి అవకాశం ఎప్పుడూ ఉండదు. ఇప్పుడైతే ఉండాల్సి వచ్చింది. నేను కాసేపు బీసీసీఐ పనులు చక్కబెడుతున్నా అన్నారు దాదా.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle