ఇంగ్లాండ్-పాక్ కెప్టెన్ల అలవాటులో పొరపాటు
06-08-202006-08-2020 13:16:41 IST
2020-08-06T07:46:41.769Z06-08-2020 2020-08-06T07:46:33.836Z - - 12-04-2021

ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవగా.. టాస్ టైమ్‌లోనే రెండు జట్ల కెప్టెన్లూ తొందరపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. క్రికెట్లో కొత్తగా కొన్ని రూల్స్ పెట్టిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వాటిని తప్పనిసరిగా ఆటగాళ్లు ఫాలో అవ్వాలని సూచించింది. మొదటిది మైదానంలో ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోకూడదు. కానీ.. మాంచెస్టర్ టెస్టులో ఆ మొదటి రూల్‌నే కెప్టెన్లు బ్రేక్ చేసి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి మ్యాచ్‌లో టాస్ వేసిన తర్వాత.. టాస్ గెలిచిన కెప్టెన్‌కి ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించడం క్రికెట్లో ఓ సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే మాంచెస్టర్ టెస్టులో పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ అజహర్ అలీ టాస్ గెలవగా.. ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ జో రూట్ షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాడు. జో రూట్ షేక్ హ్యాండ్‌కి చేయి చాచడంతో.. అజహరీ అలీ కూడా ఆనందంగా చేయి కలిపేశాడు. కానీ.. ఆ వెంటనే అజహర్ అలీకి ఐసీసీ రూల్ గుర్తొచ్చిట్లుంది. తప్పు జరిగిపోయింది... అనేలా ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌ని పాకిస్థాన్ ఆడనుండగా.. నెల రోజుల ముందే అక్కడికి వెళ్లిన పాక్ టీమ్.. 14 రోజులు క్వారంటైన్లో ఉండి కరోనా వైరస్ పరీక్షలు కూడా చేయించుకుంది. ఇరు జట్లనీ క్వారంటైన్లో ఉంచి.. కరోనా వైరస్ పరీక్షలు చేసిన తర్వాత వారిని బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చిన ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). సిరీస్‌ని పూర్తి సురక్షిత వాతారణంలో నిర్వహిస్తోంది. వికెట్ పడిన సమయంలోనూ ఆటగాళ్లు హైపై ఇచ్చుకోకుండా.. మోచేతుల్ని తాకిస్తూ సంబరాలు చేసుకోవాలని ఐసీసీ సూచించింది.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
7 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
17 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
17 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా