ఇంగ్లాండ్ టీమ్ పట్టుబిగిసేనా...
17-07-202017-07-2020 13:18:13 IST
2020-07-17T07:48:13.641Z17-07-2020 2020-07-17T07:48:11.099Z - - 14-04-2021

వెస్టిండీస్‌తో సౌథాంప్టన్ వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓడిన ఇంగ్లాండ్ టీమ్.. రెండో టెస్టులో పుంజుకుంది. మాంచెస్టర్ వేదికగా గురువారం ఆరంభమైన రెండో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 207/3తో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. క్రీజులో ఓపెనర్ డొమినిక్ సిబ్లే 253 బంతుల్లో 86 రన్స్, వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ 159 బంతుల్లో 59 పరుగులు చేశారు. తొలి టెస్టు తరహాలోనే మొదటి రోజే మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్ ఆరంభంలోనే అదీ వరుస బంతుల్లో ఓపెనర్ రోరీ బర్న్స్ (15 పరుగులు ) మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జాక్ క్రాలీ (0) వికెట్లను చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో రోస్టన్ ఛేజ్ ఆ జట్టుని దెబ్బతీశాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ జో రూట్ (23: 49 బంతుల్లో 2x4) కూడా నిరాశపరచడంతో.. ఇంగ్లాండ్ 31.2 ఓవర్లు ముగిసే సమయానికి 81/3తో కష్టాల్లో పడింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు, అల్జారీ జోసెఫ్ ఒక వికెట్ పడగొట్టాడు. కానీ.. పట్టుదలతో బ్యాటింగ్ చేసిన సిబ్లే.. బెన్‌స్టోక్స్‌తో కలిసి అసాధారణరీతిలో వెస్టిండీస్ బౌలర్లని ఎదుర్కొన్నాడు. కొన్ని సందర్భాల్లో గతి తప్పిన బంతి వచ్చినా.. డిఫెన్స్‌తో సరిపెట్టిన సిబ్లే నాలుగో వికెట్‌కి బెన్‌స్టోక్స్‌తో కలిసి అజేయంగా 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరి ఇద్దరి పోరాటంతో ఇంగ్లాండ్ కోలుకుని తొలి రోజు గౌరవప్రదమైన స్కోరుతో ఆటని ముగించింది. ఒకవేళ ఈరోజు కనీసం రెండు సెషన్ల పాటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయగలిగితే..? భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
2 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
7 hours ago

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
13 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
15 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021
ఇంకా