newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లుతున్న వరుణుడు

19-07-202019-07-2020 14:43:09 IST
Updated On 19-07-2020 16:49:08 ISTUpdated On 19-07-20202020-07-19T09:13:09.296Z19-07-2020 2020-07-19T09:12:56.394Z - 2020-07-19T11:19:08.022Z - 19-07-2020

ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లుతున్న వరుణుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాంచెస్టర్‌: వెస్టిండీస్‌పై రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ సమం చేద్దామనుకున్న ఇంగ్లండ్‌‌కు వరుణుడు గట్టి షాకిచ్చాడు. శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. 

దాంతో నిర్ణీత సమయానికంటే మూడు గంటల ముందుగానే ఆట నిలిచిపోయింది. అయితే ఆదివారం నాడు పరిస్థితులు మెరుగ్గా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది.

నైట్‌ వాచ్‌మన్‌ అల్జారి జోసెఫ్‌ (14 బ్యాటింగ్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు వెస్టిండీస్‌ ఇంకా 437 పరుగులు వెనుకంజలో ఉంది.

ఇక మూడోరోజు ఆట వర్షంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో మిగిలిన రెండు రోజుల్లో 196 ఓవర్లలో వెస్టిండీస్ జట్టును రెండుసార్లు ఆలౌట్‌ చేయడం ఇంగ్లండ్‌ బౌలర్లకు శక్తికి మించిన పనే.

రోజంతా వర్షంతో పిచ్‌ మొత్తం కప్పి ఉంచడంతో నాలుగోరోజు ఆటలో తేమ పరిస్థితులను ఇంగ్లండ్‌ పేసర్లు సద్వినియోగం చేసుకున్నా.. ప్రత్యర్థి 19 వికెట్లను పడగొట్టడం కష్టమే. 

అందునా తొలి టెస్టు నెగ్గిన ఊపులో ఉన్న పర్యాటక జట్టు అంత సులువుగా లొంగుతుందా అన్నది ప్రశ్నార్థకమే. మూడోరోజు కనీసం 20 ఓవర్ల ఆటన్నా జరిగుంటే ఇంగ్లండ్‌ జట్టుకు ఒకింత అవకాశముండేది.

మాంచెస్టర్‌లో ఉండే వాతావరణ పరిస్థితుల రీత్యా.. శుక్రవారం నాడు ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో చకచకా ఆడడంతోపాటు 400 పరుగులకే డిక్లేర్‌ చేసి ఉంటే వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ఇంకా ముందుగా ప్రారంభమయ్యేది.

దాంతో ప్రత్యర్థివి మరో ఒకటి రెండు వికెట్లను పడగొట్టే అవకాశమూ ఇంగ్లండ్‌కు లభించేది. ఇక తొలి టెస్టు నెగ్గిన విండీస్‌ ప్రస్తుతం 1-0తో ముందంజలో ఉంది.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle