newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

11-07-202011-07-2020 10:55:30 IST
Updated On 11-07-2020 11:49:47 ISTUpdated On 11-07-20202020-07-11T05:25:30.011Z11-07-2020 2020-07-11T05:25:16.980Z - 2020-07-11T06:19:47.533Z - 11-07-2020

ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంగ్లాండ్ జట్టుకి దాని సొంతగడ్డపైనే వెస్టిండీస్ చెమటలు పట్టిస్తోంది. సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ని మొదట 204 పరుగులకి కుప్పకూల్చిన వెస్టిండీస్ టీమ్.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేయడం ద్వారా 114 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు మూడు నెలల తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో ఈ టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 57/1తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన వెస్టిండీస్ టీమ్‌లో భారీ స్కోర్లు నమోదవలేదు. కానీ.. గౌరవప్రదమైన ఆధిక్యాన్ని దక్కించుకోగలిగింది. 

ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్ (65: 125 బంతుల్లో 6x4), వికెట్ కీపర్ డౌరిచ్ (61: 115 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీలు బాదగా.. రోస్టన్ ఛేజ్ (47), బ్రూక్స్ (39) కూడా విలువైన పరుగులు చేశారు. దాంతో.. వెస్టిండీస్ 102 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 318 పరుగులకి ఆలౌటైంది. అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలోనే కుప్పకూలడం విశేషం.

వెస్టిండీస్‌కి 114 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించగా.. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 15/0తో నిలిచింది. క్రీజులో రాయ్ బర్న్స్ (10 బ్యాటింగ్), సిబ్లీ (5 బ్యాటింగ్) ఉన్నారు.

ఆటలో ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ఇంగ్లాండ్ ఇంకా 99 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పుంజుకుని భారీ లక్ష్యాన్ని కరీబియన్లకి నిర్దేశించడం కష్టమే. దాంతో.. వెస్టిండీస్ టీమ్‌కే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle