newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంగ్లండ్ v/s ఐర్లాండ్.. వన్డే సూపర్ లీగ్

30-07-202030-07-2020 09:28:25 IST
2020-07-30T03:58:25.783Z30-07-2020 2020-07-30T03:58:07.097Z - - 15-04-2021

ఇంగ్లండ్ v/s ఐర్లాండ్.. వన్డే సూపర్ లీగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఇప్పుడు వన్డే వార్‌కు రెడీ అయింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. గురువారం జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభంకానుంది.

టాప్ టీమ్, చిన్న జట్టు మధ్య పోటీనే అయినప్పటికీ వరల్డ్ క్రికెట్ దృష్టి దీనిపై ఉంది. ఎందుకంటే వన్డేలకు ఆదరణ పెంచేందుకు ఐసీసీ ప్రవేశపెట్టిన సూపర్ లీగ్ ఈ సిరీస్‌తోనే మొదలవనుంది. 2023 వన్డే ప్రపంచకప్‌కు ఈ లీగ్ క్వాలిఫికేషన్‌గా నిలవనుంది.

ఇందులో భాగంగా మూడేళ్లలో ప్రతీ జట్టు 8 సిరీస్‌లు ఆడనుంది. దాంతో మెగాలీగ్‌లో బోణీ కొట్టి వరల్డ్‌కప్ అర్హతకు బాటలు వేసుకోవాలని ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ భావిస్తోంది. స్టోక్స్, జోరూట్, బట్లర్‌కు విశ్రాంతి ఇవ్వగా విండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడిన వాళ్లలో జో డెన్లీ ఒక్కడే వన్డే టీమ్‌లో ఉన్నాడు. జాసన్ రాయ్, బెయిర్‌స్టో, మోర్గాన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌తో హోమ్‌టీమ్ బలంగానే ఉంది.

మరోవైపు 2011లో ఇంగ్లండ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఐర్లాండ్ మరోసారి అలాంటి సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చాలని ఆశిస్తోంది. కెవిన్ ఒబ్రెయిన్, పాల్ స్టిర్లింగ్‌పై అంచనాలున్నాయి. కరోనా  తర్వాత జరుగుతున్న ఫస్ట్ వన్డే సిరీస్‌లో ఆండీ బాల్బిర్నీ కెప్టెన్సీలోని ఐర్లాండ్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   an hour ago


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   2 hours ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   6 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   9 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   a day ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle