newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఇంగ్లండ్ సునాయాస విజయం.. సిరీస్ కైవసం

29-07-202029-07-2020 09:00:33 IST
2020-07-29T03:30:33.678Z29-07-2020 2020-07-29T03:30:20.151Z - - 04-08-2020

ఇంగ్లండ్ సునాయాస విజయం.. సిరీస్ కైవసం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాంచెస్టర్ టెస్టులో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు క్రిస్‌వోక్స్ (4/50), స్టువర్ట్ బ్రాడ్ (4/36) దెబ్బకి పేలవంగా 129 పరుగులకే కుప్పకూలిపోయింది.

269 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్.. మూడు టెస్టుల సిరీస్‌ని 2-1తో కైవసం చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ సిరీస్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది.

ఇంగ్లాండ్ ఆలౌట్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ టీమ్.. 197 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో జేసన్ హోల్డర్ (46: 82 బంతుల్లో 6x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ ఆరు వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. జేమ్స్ అండర్సన్ రెండు, జోప్రా ఆర్చర్, క్రిస్‌వోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్‌ టీమ్‌కి 172 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

172 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. రోరీ బర్న్స్ 90 పరుగులు, డొమినిక్ సిబ్లీ 56 పరుగులు, జో రూట్ 68 పరుగులతో దూకుడుగా ఆడటంతో ఇన్నింగ్స్‌ని 226/2తో డిక్లేర్ చేసింది. దాంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్‌కి ఇంగ్లాండ్ నిర్దేశించింది.

భారీ లక్ష్యఛేదనలో ఆరంభం నుంచే వెస్టిండీస్ తడబడింది. ఓపెనర్ క్యాంప్‌బెల్ (0) డకౌటవగా.. మరో ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్ (19).. అనంతరం వచ్చిన కీమర్ రోచ్ (4), షై హోప్ (31) నిరాశపరిచారు. కానీ..ఆఖర్లో బ్లాక్‌‌వుడ్ 23 పరుగులతో కాసేపు ఇంగ్లాండ్ బౌలర్లని సహనంతో ఎదుర్కొన్నాడు. కానీ.. అతని పోరాటం ఇంగ్లాండ్ గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle