newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంగ్లండ్, భారత్ సిరీస్ వాయిదా

08-08-202008-08-2020 12:17:52 IST
2020-08-08T06:47:52.368Z08-08-2020 2020-08-08T06:47:07.570Z - - 19-04-2021

ఇంగ్లండ్, భారత్ సిరీస్ వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా మరో క్రికెట్ సిరీస్ వాయిదాపడింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఈ ఏడాది సెప్టెంబరు- అక్టోబరులో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండటంతో వచ్చే ఏడాదికి ఈ సిరీస్‌ వాయిదాపడింది. డిసెంబరు 3న ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న టీమిండియా  జనవరి 17 తర్వాత మళ్లీ ఇండియాకి రానుంది.

ఆ తర్వాతే ఇంగ్లాండ్‌తో సిరీస్‌‌ని నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా స్పష్టం చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. 

ఆ తర్వాత యూఏఈ నుంచే నేరుగా ఆస్ట్రేలియాకి వెళ్లనున్న టీమిండియా.. డిసెంబరు 3 నుంచి నాలుగు టెస్టులు, జనవరి 12 నుంచి మూడు వన్డేలను కంగారూలతో ఆడనుంది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా భారత్‌కి వచ్చిన వెంటనే ఇంగ్లాండ్‌తో జనవరి- మార్చిలో సుదీర్ఘ సిరీస్‌ని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ మేరకు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

జనవరి చివరి వారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కూడా జరిగేలా బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2021 సీజన్ జరిగే అవకాశం ఉంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle