ఇంగ్లండ్ జట్టు పై.. 244 పరుగుల ఆధిక్యంలో పాక్
08-08-202008-08-2020 12:34:16 IST
2020-08-08T07:04:16.534Z08-08-2020 2020-08-08T07:02:22.784Z - - 19-04-2021

ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన పాక్.. శుక్రవారం ఇంగ్లండ్ 219 పరుగులకే పరిమితం చేసి 107 పరుగుల ఆధిక్యం సాధించింది.స్పిన్నర్లు యాసిర్ షా (4/66), షాదాబ్ ఖాన్ (2/13)లతో పాటు మహ్మద్ అబ్బాస్ (2/33) ఇంగ్లీష్ జట్టును దెబ్బ తీశారు. ఒలీ పోప్ (62; 117 బంతుల్లో 84) టాప్ స్కోరర్. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. మూడో రోజు ఆట ముగిసేసమయానికి 137/8తో నిలిచింది. పాక్ 244 ప్రస్తుత ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 92/4తో మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. కాసేపటికే ఒలీ పోప్ (62) వికెట్ కోల్పోయింది.ఇంగ్లండ్ జట్టు స్కోరు 127 దగ్గర పోప్ అయిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. వోక్స్ (19)తో కలిసి కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించిన బట్లర్ (38).. యాసిర్ షా బౌలింగ్‌లో వెనుదిరిగాక పతనం ఊపందుకుంది. షా, షాదాబ్ కలిసి ఇంగ్లాండ్ లోయరార్డర్‌ను కుప్పకూల్చారు. స్టువర్ట్ బ్రాడ్ (29 నాటౌట్) పోరాడకుంటే ఇంగ్లండ్ 200 కూడా దాటేది కాదు. పాక్ బౌలర్లలో యాసిర్ షా 4 వికెట్లు పడగొట్టాడు.వంద పైచిలుకు ఆధిక్యం కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు తర్వాత బౌలర్లు ఆశలు కల్పించారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను తీవ్రంగా దెబ్బ కొట్టారు. పాక్ 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో షాన్ మసూద్‌ను డకౌట్ చేసిన బ్రాడ్.. జట్టుకు శుభారంభం అందించాడు. వోక్స్ (2/11) పాక్‌ను గట్టి దెబ్బ తీశాడు. కెప్టెన్ అజహర్ అలీ (18), స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ (5)లను ఔట్ చేశాడు. ఈ సమయంలో అసద్ షఫీక్ (29), రిజ్వాన్ (27) వికెట్ల పతనాన్ని అడ్డుకుని స్కోరును 100 దాటించారు.అయితే షఫీక్, రిజ్వాన్ తక్కువ వ్యవధిలో ఔటవడంతో పాక్ మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత షాబాద్ ఖాన్ (15)ను బ్రాడ్.. షాహిన్ ఆఫ్రిది (2)ని బెన్ స్టోక్స్ ఔట్ చేయడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ జట్టును బౌలింగ్‌లో ఆదుకున్న యాసిర్ షా.. బ్యాటింగ్‌లో కూడా తన వంతు కృషిచేశాడు. 12 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. మరోవైపు మొహమ్మద్ అబ్బాస్ (0) షాకు జతగా ఉన్నాడు. ఇక నసీం షా ఒక్కడే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఆధిక్యం లో పాకిస్థాన్ ఉంది. ఈ వేదికలో లక్ష్యం 250 దాటినా సవాలే అని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఛేదన ఇంగ్లండ్‌కు అంత తేలిక కాదు. రెండో రోజు షాన్ మసూద్ బ్యాటింగ్ హైలైట్ కాగా.. మూడో రోజు మాత్రం బౌలర్లదే ఆటంతా. శనివారం మొత్తం 14 వికెట్లు పడ్డాయి.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
3 hours ago

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
11 hours ago

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
21 hours ago

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
18-04-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
17-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
16-04-2021

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021
ఇంకా