newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఇంగ్లండ్ చేతిలో ఐర్లాండ్ ... రెండోసారి ఓటమి

02-08-202002-08-2020 10:16:06 IST
Updated On 02-08-2020 10:16:43 ISTUpdated On 02-08-20202020-08-02T04:46:06.712Z02-08-2020 2020-08-02T04:45:08.076Z - 2020-08-02T04:46:43.362Z - 02-08-2020

ఇంగ్లండ్ చేతిలో ఐర్లాండ్ ... రెండోసారి ఓటమి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐర్లాండ్ వరుసగా రెండో వన్డేలోనూ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. సౌథాంప్టన్ వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తాచాటిన ఇంగ్లాండ్ టీమ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఒక వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. 

ఇక సిరీస్‌లో నామమాత్రమైన ఆఖరి వన్డే మంగళవారం సాయంత్రం 6.30 గంటలకి ప్రారంభంకానుంది. ఇటీవల వెస్టిండీస్‌ని మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. ఆఖరి వరకూ బ్యాటింగ్ చేసినా 9 వికెట్ల నష్టానికి కేవలం 212 పరుగులే చేయగలిగింది. 

ఆ జట్టులో క్యాంఫెర్ 87 బంతుల్లో 67 పరుగులతో సత్తాచాటగా.. సిమీ సింగ్ (25), ఆండీ బెక్‌బ్రైన్ (24), హారీ టెక్టర్ (28) కాసేపు క్రీజులో నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (3/34), డేవిడ్ విల్లీ (2/48) నిలకడగా రాణించారు.అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (0) నిరాశపరచగా.. తర్వాత వచ్చిన జేమ్స్ విన్స్ (16). టామ్ బాంటన్ (15) తేలిపోయారు. 

మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 41 బంతుల్లో 82 పరుగులతో దూకుడుగా ఆడేశాడు. అతనికి శామ్ బిల్లింగ్స్ 61 బంతుల్లో 46 నాటౌట్తో సపోర్ట్ లభించడంతో ఇంగ్లాండ్ అలవోకగా విజయాన్ని అందుకునేలా కనిపించింది. ఇంగ్లండ్ జట్టు స్కోరు 131 దగ్గర బెయిర్ స్టో ఔటవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0), మొయిన్ అలీ (0) వరుసగా డకౌటయ్యారు. దాంతో... ఐర్లాండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. డేవిడ్ విల్లీ 46 బంతుల్లో 47 పరుగులు చెయ్యడంతో ఐర్లాండ్‌కి విజయం దక్కనివ్వలేదు. 

క్రీజులో కుదురుకున్న తర్వాత విల్లీ భారీ షాట్లు ఆడేశాడు. దాంతో.. 32.3 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 216/6తో విజయాన్ని అందుకుంది. గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన బెయిర్‌స్టోకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle