ఆ హీరోయిన్ తో ప్రేమలో పృథ్వీ షా..
10-09-202010-09-2020 23:32:48 IST
Updated On 10-09-2020 23:34:20 ISTUpdated On 10-09-20202020-09-10T18:02:48.433Z10-09-2020 2020-09-10T18:02:46.351Z - 2020-09-10T18:04:20.400Z - 10-09-2020

టీమ్ఇండియా క్రికెటర్లు.. బాలీవుడ్ భామల మధ్య ప్రేమాయణం కొత్తేమీ కాదు. ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కొందరు వాటిని నిజం చేస్తూ పెళ్లి చేసుకోగా.. మరి కొందరు మాత్రం అలాంటిది ఏమీ లేదు.. మేము స్నేహితులం మాత్రమే అంటూ కొట్టి పారేస్తుంటారు. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, జహీర్ ఖాన్ - సాగరిక, యువరాజ్ సింగ్-హజెల్ కీచ్, హార్దిక్ పాండ్యా-నటాషా లు వివాహా బంధంలో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా యువ క్రికెటర్ పృథ్వీ షా కూడా ఓ బాలీవుడ్ భామతో ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆటగాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ ఆడేందుకు యూఏఈలో ఉన్నాడు. ఐపీఎల్లో షా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున బరిలో దిగనున్నాడు. గత సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న షా.. మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని బావిస్తున్నాడు. ఇందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దానికి ప్రాచీ సింగ్ కామెంట్ చేశారు. కలర్స్ టీవీలో ప్రసారమయ్యే ఉడాన్ సిరీయల్లో ప్రాచి సింగ్ నటించింది. వారిద్దరి సంభాషణ చూస్తూంటే.. స్నేహానికి మించి వారిద్దరి మధ్య ఏదో సంథింగ్.. సంథింగ్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క పోస్టుకే కాదు.. పృథ్వీ షా పెట్టె ప్రతి పోస్టుకి.. ప్రాచీ స్పందించడం విశేషం. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. దీనిపై ఇప్పటి వరకు ఇటు పృథ్వీ కానీ.. అటు ప్రాచీ గానీ స్పందించలేదు. అంతర్జాతీయ కెరీర్లో షా ఇప్పటివరకు 4 టెస్టుల్లో, 3 వన్డే మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా తరుపున ఆడాడు. ఐపీఎల్ 2018 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్న పృథ్వీ షా.. ఇప్పటి వరకూ 25 మ్యాచ్‌లాడి 598 పరుగులు చేశాడు. సెప్టెంబర్ 20న ఢిల్లీ తన తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది. Prithvi Shaw, Actress Prachi Singh, IPL2020, Delhi Capitals

RCBvsRR: బెంగళూరు వరుస విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వెయ్యగలదా?
5 hours ago

చెన్నై సూపర్ కింగ్స్ ను టెన్షన్ పెట్టగా.. చివరికి..!
13 hours ago

CSK vs KKR: ధోని కెప్టెన్సీ ముందు KKR నిలిచేనా?
21-04-2021

SRH లక్ష్యం 120 ఛేదించేనా తడబడేనా?
21-04-2021

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..
21-04-2021

ధోని తల్లిదండ్రులకు కరోనా..!
21-04-2021

రోహిత్ శర్మకు భారీ జరిమానా..!
21-04-2021

DC vs MI: ముంబై బౌలింగ్ ధాటికి.. ఢిల్లీ బ్యాటమెన్ నిలవగలరా..!
20-04-2021

రాజస్థాన్ ను చిత్తు చేసిన చెన్నై
20-04-2021

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
19-04-2021
ఇంకా