newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ సిరీస్ లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇద్దాం..!

17-09-202017-09-2020 22:41:04 IST
2020-09-17T17:11:04.589Z17-09-2020 2020-09-17T17:11:02.979Z - - 20-04-2021

ఆ సిరీస్ లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇద్దాం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి కేవలం యువ ఆటగాళ్లను మాత్రమే జింబాబ్వే సిరీస్ కు సెలెక్ట్ చేయాలని పాకిస్థాన్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ హఫీజ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సూచించాడు. జింబాబ్వే పాకిస్థాన్ టూర్ అక్టోబర్ 20 నుండి మొదలు కాబోతోంది. మూడు వన్డే మ్యాచ్ లు, మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ముల్తాన్, రావల్పిండి లో ఈ మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

నేను ఈ సిరీస్ ఆడకుండా రెస్ట్ తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాను. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం.. ఇలాంటప్పుడే వాళ్ళ ట్యాలెంట్ బయటకు వస్తుంది అని హఫీజ్ మీడియాతో చెప్పుకొచ్చాడు. హఫీజ్ ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. రెండు హాఫ్ సెంచరీలు బాది తన ఫామ్ ను కొనసాగించాడు. మొదటి మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడిన యువ ఆటగాడు హైదర్ అలీ ఇంకా మెరుగవ్వాలని హఫీజ్ చెబుతున్నాడు. 'హైదర్ అలీ లో గొప్ప ట్యాలెంట్ ఉంది.. ఎంతో కాన్ఫిడెన్స్ తో బ్యాటింగ్ చేస్తాడు.. ఇంకా అతడి టెక్నిక్ విషయంలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. టెక్నిక్ అన్నది సాలిడ్ గా ఉంటే ఇంటర్నేషనల్ కెరీర్ లో మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చు' అని హఫీజ్ అభిప్రాయ పడ్డాడు.

యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో రాణించడం తాను ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉంటానని.. ట్యాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లు వస్తేనే పాకిస్థాన్ క్రికెట్ ముందుకు సాగుతుందని హఫీజ్ చెబుతున్నాడు. హఫీజ్ బౌలింగ్ యాక్షన్ మీద కూడా ఐసీసీ నిఘా ఉంచిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో హఫీజ్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని చెప్పడంతో అతడు ఐసీసీ బౌలింగ్ యాక్షన్ అసెస్మెంట్ లో తన బౌలింగ్ యాక్షన్ ను సరిగా చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో హఫీజ్ కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దీనిపై కూడా అతడు స్పందించాడు. 'ఇంగ్లాండ్ తో సిరీస్ లో బౌలింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ నాతో బౌలింగ్ వేయించాలా.. వేయించకూడదా అన్నది కెప్టెన్ నిర్ణయం. భవిష్యత్తులో బౌలింగ్ వేయమని అడిగితే.. వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను' అని హఫీజ్ చెప్పుకొచ్చాడు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle