newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ లక్కీ ఛాన్స్ ను సొంతం చేసుకున్న YUPPTV..!

18-09-202018-09-2020 09:35:42 IST
2020-09-18T04:05:42.957Z18-09-2020 2020-09-18T04:05:40.208Z - - 15-04-2021

ఆ లక్కీ ఛాన్స్ ను సొంతం చేసుకున్న YUPPTV..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్-2020 మహా సంగ్రామం ఇంకొన్ని గంటల్లో మొదలుకాబోతోంది. ఇప్పటికే టెలీకాస్ట్ చేసే ఛానల్స్ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ వస్తున్నాయి. ఐపీఎల్ సమయంలో కాసుల వర్షం పక్కా అని ఛానల్స్ యాజమాన్యాలు ఎంతో ధైర్యంగా ఉన్నాయి. ఇక ఓటీటీలో కూడా ఐపీఎల్ ప్రసారం కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి ఆ హక్కులు యప్ టీవీ సొంతమయ్యాయి.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ యప్‌ టీవీ ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. మొత్తం 60 మ్యాచ్‌లకు డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 హక్కులను సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరప్, మలేషియా, సౌత్ ఈస్ట్ ఆసియా (సింగపూర్ మినహా), శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మధ్య ఆసియా, మధ్య మరియు దక్షిణ అమెరికా తదితర చోట్ల ఐపీఎల్‌ మ్యాచ్‌లను యప్‌టీవీ ప్రత్యక్ష్య ప్రసారం చేయనుంది.

“గత కొన్నేళ్లుగా, ఐపీఎల్ దేశంలో అత్యంత ప్రియమైన క్రికెట్ టోర్నమెంట్‌గా మారింది. లాక్‌డౌన్‌ మధ్య, ఇది ప్రేక్షకులలో కొత్త సంచలనం, ఆశావాదం మరియు వ్యామోహానికి దారి తీస్తుంది. ఐపీఎల్ ప్రత్యక్ష అనుభవం రద్దీగా ఉండే స్టేడియాలకు బదులుగా వారి ఇళ్ల నుండి, అంకితమైన టెక్నాలజీ వీక్షణ అనుభవం మరియు తక్షణ వర్చువల్ అనుభవం అభిమానుల కోసం ఈ సంవత్సరం టోర్నమెంట్‌ను మెరుగుపరుస్తాయి, ఈ ప్రసార హక్కులు యప్ టీవీ ప్రేక్షకుల సంఖ్యను పెంచడానికి దోహదపడుతుంది.” అని యప్ టీవీ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ ఉదయ్ రెడ్డి మీడియాకు తెలిపారు.

సెప్టెంబర్ 19న ఐపీఎల్ మొదలు కాబోతోంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ఐపీఎల్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు 4 సార్లు ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు సార్లు టైటిల్ నెగ్గింది. గత ఏడాది ఐపీఎల్ ఫైనల్ ముంబై, చెన్నై మధ్య జరిగిన సంగతి తెలిసిందే..! 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   12 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   16 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle