newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

ఆ ముగ్గురూ టీ20 ప్రపంచ కప్ ఆడనందుకు కారణం అతడే.. లాల్ చంద్ వ్యాఖ్య

30-06-202030-06-2020 07:27:57 IST
Updated On 30-06-2020 08:57:26 ISTUpdated On 30-06-20202020-06-30T01:57:57.716Z30-06-2020 2020-06-30T01:57:55.460Z - 2020-06-30T03:27:26.278Z - 30-06-2020

ఆ ముగ్గురూ టీ20 ప్రపంచ కప్ ఆడనందుకు కారణం అతడే.. లాల్ చంద్ వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2007 టి20 ప్రపంచకప్‌ విజేత భారత జట్టు మేనేజర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఇన్నాళ్ల తర్వాత ఒక నిజం బయటపెట్టారు. ఎమ్మెస్‌ ధోని నేతృత్వంలో 2007 టి20 ప్రపంచకప్‌ గెలిచి భారత జట్టు సంచలనం సృష్టించింది. అయితే ఈ మెగా టోర్నీలో ఆడరాదని నాటి సీనియర్లు సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ అంతకు కొద్దిరోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. ఫలితంగా ధోని కెప్టెన్‌గా యువ జట్టు బరిలోకి దిగింది. 

దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అంశాన్ని ఆ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పంచుకున్నారు. అప్పటి టెస్టు, వన్డే కెప్టెన్‌ ద్రవిడ్‌ తనతో పాటు మిగతా ఇద్దరినీ ఇందు కోసం ఒప్పించాడని ఆయన చెప్పారు.

‘తానే కాదు... సచిన్, గంగూలీ కూడా టి20 వరల్డ్‌కప్‌ ఆడాల్సిన అవసరం లేదని ద్రవిడ్‌ భావించాడు. తనే స్వయంగా వారికి చెప్పి నిరోధించాడనేది వాస్తవం. దానికి ముందు జరిగిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో ద్రవిడ్‌గా కెప్టెన్‌గా ఉన్నాడు. కొందరు ఆటగాళ్లయితే నేరుగా ఇంగ్లండ్‌ నుంచే వరల్డ్‌కప్‌ కోసం దక్షిణాఫ్రికా వచ్చారు. ఆ సమయంలో కుర్రాళ్లకు చాన్స్‌ ఇద్దామని ద్రవిడ్‌ చెప్పాడు. 

అయితే మన జట్టు ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత వారంతా కచ్చితంగా పశ్చాత్తాప పడి ఉంటారు. ఎందుకంటే నేను ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఒక్క ప్రపంచకప్‌ కూడా గెలవలేదు అని సచిన్‌ నాతో తరచుగా చెప్పేవాడు’ అని రాజ్‌పుత్‌ అన్నారు.  

చివరకు సచిన్ 2011లో వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్నాడు. తన కెరీర్‌లో ప్రపంచ కప్ గెల్చుకోవడానికి సచిన్ మామూలుగా ఆరాటపడలేదు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం లోని యువ జట్టు తన తొలి ప్రయత్నంలోనే టీ20 ప్రపంచ కప్ గెల్చుకోవడంతో సీనియర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే సచిన్, గంగూలీ, ద్రావిడ్‌లు స్వచ్చందంగా యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తొలి టి20 ప్రపంచ కప్‌లో భారత్ తరపున అడకుండా తప్పుకున్నారు. అది వారికి నష్టం కలిగించగా యువజట్టుకు అనేక అవకాశాలు తలుపు తట్టాయి  అని లాల్ చంద్ రాజ్ ఫుత్ తెలిపారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle